పైలట్ చాకచక్యం.. తప్పిన భారీ విమాన ప్రమాదం
మయన్మార్‌లో భారీ విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. మయన్మార్ నేషనల్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమాన పైలట్ చాకచక్యంగా వ్యవహరించి 89 మంది ప్రాణాలు కాపాడాడు. యాంగూన్‌లో మాండలే ఎయిర్ పోర్ట్‌లో విమానం ల్యాండ్ అవుతుండగా.. ముందు టైరు తెరుచుకోలేదు. దీంతో క్షణాల్లో అప్రమత్తమైన పైలట్ చాకచక్యంగా వ్యవహరించాడు. టైరు తెరుచుకోకుండా ల్యాండింగ్ అంటే ప్రాణాలతో చెలగాటమే అని భావించి.. వెనుక టైర్ల సాయంతో ల్యాండ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. విమానం ముందు భాగం రన్‌వే […]

మయన్మార్‌లో భారీ విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. మయన్మార్ నేషనల్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమాన పైలట్ చాకచక్యంగా వ్యవహరించి 89 మంది ప్రాణాలు కాపాడాడు. యాంగూన్‌లో మాండలే ఎయిర్ పోర్ట్‌లో విమానం ల్యాండ్ అవుతుండగా.. ముందు టైరు తెరుచుకోలేదు. దీంతో క్షణాల్లో అప్రమత్తమైన పైలట్ చాకచక్యంగా వ్యవహరించాడు. టైరు తెరుచుకోకుండా ల్యాండింగ్ అంటే ప్రాణాలతో చెలగాటమే అని భావించి.. వెనుక టైర్ల సాయంతో ల్యాండ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. విమానం ముందు భాగం రన్‌వే కు ఏ మాత్రం తగిలినా విమానం బుగ్గిపాలయ్యేది. దీంతో వెనుక టైర్ల సాయంతో విమానాన్ని ఎంతో నేర్పుగా కిందకు దించాడు పైలట్. చాకచక్యంగా విమానాన్ని ల్యాండ్ చేసిన పైలట్‌ను అభినందించారు అధికారులు.