June 21: జూన్ 21.. మంగళవారం కొన్ని ప్రత్యేక రోజులు ఉన్నాయి. ఈ 21వ తేదీ చాలా ప్రత్యేకమైనది. ఒక్క రోజే కొన్ని ప్రత్యేకమైన రోజులకు వేడుక కానుంది. ప్రతి అంశంపై కూడా ఇలాంటి దినోత్సవాలు జరుపుకొంటారు. కానీ ఇతర తేదీల్లో వస్తుంటాయి. ఈ ఒక్క రోజు ఐదు దినోత్సవాలు వచ్చాయి. అవేంటో ఓ సారి చూద్దాం..
ప్రపంచ యోగా దినోత్సవం
2015 భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపు ఇచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. దీంతో ఈ రోజున యోగా దినోత్సవాన్ని జరుపుకొంటున్నాము.
ప్రపంచ సంగీత దినోత్సవం
జూన్ 21న ప్రపంచ సంగీత దినోత్సవం (వరల్డ్ మ్యూజిక్ డే) ను నిర్వహించుకుంటారు. 1982లో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఇది మొదలైంది. ప్రస్తుతం ఈ దినోత్సవాన్ని ప్రపంచంలోని 120 దేశాలు జరుపుకొంటున్నాయి. మానసిక ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి సంగీతానికి మాత్రమే సొంతం అనడంలో అతిశయోక్తి లేదు. ఏ సంగీతానికైనా శాస్త్రీయ సంగీతమే ప్రాణం, మూలం.
ప్రపంచ మానవత్వ దినోత్సవం:
జూన్ 21న ప్రపంచ మానవత్వ దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. ప్రజల్లో మానవత్వాన్ని పెంచేలా 1980లో మానవత్వ దినోత్సవం జరుపుకొంటున్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా మానవత్వాన్ని పెంపొందించేందుకు స్ఫూర్తిగా నిర్వహిస్తుంటారు.
టీ షర్ట్‌డే:
అన్ని దినోత్సవాల లాగే జూన్ 21న టీ షర్ట్ దినోత్సవాన్ని కూడా జరుపుకొంటారు. 2008లో దీనిని ఓ జర్మనీకి చెందిన దుస్తుల సంస్థ మొదలు పెట్టింది. యువత దీనిని ఎక్కువగా ఫాలో అవుతుంటారు. కొన్ని దేశాలలో టీ షర్ట్ డే ఓ ఉత్సవంలా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే నేడు అంతర్జాతీయ టీ షర్ట్‌డేగా జరుపుకొంటారు.
అయితే జూన్ 21న ఈ ప్రత్యేక రోజులు ఎందుకని చాలా మందిలో అనుమానం వస్తుంటుంది. ఈ దినోత్సవాల రోజుల్లో మంచి నిర్ణయాలు తీసుకోవాలి.. రాబోయే తరల వారికి వాటిని అందిస్తుండాలని. వీటిని ఐక్యరాజ్యసమితి తీర్మానాలు చేసి ప్రపంచానికి అందిస్తుంటాయి. అలాగే యోగాడే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేది. యోగా వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉండేందుకు ఈ దినోత్సవం రోజున ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖలు సూచిస్తుంటాయి. ఇలా ముఖ్యమైన డేలను జరుపుకోవడం వల్ల ప్రజల్లో చైతన్యం రావడం, అవగాహన కల్పించుకోవడం వల్ల జీవన విధానానికి ఎన్నో ఉపయోగాలుంటాయని గుర్తు చేస్తూ ఇలాంటి దినోత్సవాలను జరుపుకొంటారు. అంతేకాదు వీటి వల్ల మంచి నిర్ణయాలు తీసుకుంటూ, సూచనలు, సలహాలు పాటిస్తూ ప్రత్యేక రోజులు జరుపుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు, మేధావులు సూచిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి