పుట్టింటికి వెళ్తానని చెప్పి భర్తకు షాక్ ఇచ్చి మరో పెళ్లి చేసుకున్న భార్య…. ఆరాతీస్తే మరో 19మందిని వివాహం చేసుకుందని..

|

Jun 03, 2021 | 2:08 PM

Wife Marries Another Man:ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకీ పెళ్లికాని ప్రసాదుల సంఖ్య పెరిపోతుంది. వయసు దాటినా పెళ్లికాకపోవడంతో వీరు ఎక్కువగా మ్యారేజ్ బ్యూరోలను..

పుట్టింటికి వెళ్తానని చెప్పి భర్తకు షాక్ ఇచ్చి మరో పెళ్లి చేసుకున్న భార్య.... ఆరాతీస్తే మరో 19మందిని వివాహం చేసుకుందని..
China Man
Follow us on

Wife Marries Another Man:ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకీ పెళ్లికాని ప్రసాదుల సంఖ్య పెరిపోతుంది. వయసు దాటినా పెళ్లికాకపోవడంతో వీరు ఎక్కువగా మ్యారేజ్ బ్యూరోలను సంప్రదిస్తున్నారు. మ్యాచ్ మేకర్ చేతిలో మోసపోతున్నారు. అమ్మాయికి ఎంతో కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్న భార్యకు అంతకు ముందే మరో అతనితో పెళ్లి అయిందనే విషయం తెలుసుకుని షాక్ తిన్నాడు. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. చైనీస్ వ్యక్తి.. సోషల్ మీడియాలో కనిపించిన వీడియో చూసి షాక్ తిన్నాడు. ఎందుకంటే ఆ వీడియో తన భార్య మరొక వ్యక్తిని వివాహం చేసుకున్న సందర్భంలోనిది ఆ వీడియో వివరాల్లోకి వెళ్తే..

ఇన్నర్ మంగోలియాలోని బయాన్నూర్‌కు చెందిన 35 ఏళ్ల చైనీస్ వ్యక్తి కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. దీంతో మ్యాచ్ మేకర్ ను సంప్రదించాడు. చైనీస్ వ్యక్తి కి మ్యాచ్ మేకర్ గన్సులోని ఒక మహిళకు పరిచయం చేశాడు. వీరిద్దరూ ఒక నెల తర్వాత వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యారు. అయితే ఆ మహిళ తాను పెళ్లి చేసుకోవాలంటే.. 148,000 యువాన్ల (రూ. 16.9 లక్షలు) కట్నం కోరింది. మహిళ అడిగిన కట్నం ఇచ్చి ఆ మహిళను సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్నాడు చైనాకు చెందిన వ్యక్తి. అయితే మహిళ తన ఇంటి రిజిస్ట్రేషన్లో కొని సమస్యలు ఉన్నాయని .. పెళ్లిని తర్వాత అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయించుకుందామని కోరింది.

అయితే చైనీస్ వ్యక్తి మార్చిలో, సోషల్ మీడియా లో స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు తన భార్య మరొక వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు కనిపించిన వీడియోను ఓ వ్యక్తి చూశాడు. నిజం తెలుసుకోవడానికి పెళ్లి జరిగిన స్థలాన్ని వెళ్లి ఎంక్వైరీ చేశాడు. ఆ వీడియోలోని మహిళ వాస్తవానికి తన భార్య అని తెలిసి అతను షాక్తిన్నాడు. దీంతో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ సందర్భంలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

చైనా కు చెందిన వ్యక్తే కాదు.. ఈ మహిళ మరో 19 మంది పురుషులను పెళ్లి పేరుతొ మోసం చేసినట్లు తెలిసింది. ఈ 19 మంది పురుషులు వాహ కుంభకోణంలో మోసపోయినట్లు తెలిసింది. బాధితుల్లో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు మరియు సగటు వివాహ వయస్సు కంటే ఎక్కువ. వారు 2 మిలియన్ యువాన్లకు (రూ .2.28 కోట్లు) మోసపోయారని ఇన్నర్ మంగోలియాలోని అధికారులు గత వారం చెప్పారు.

అదే ప్రావిన్స్‌కు చెందిన దావా అనే మరో మహిళ 2019 ఆగస్టు నుంచి ఇదే కుంభకోణానికి పాల్పడినట్లు సౌత్ చైనా అధికారులు తెలిపారు. వధువు బంధువులుగా వ్యవహరిస్తున్న ఇద్దరు మహిళలను, మ్యాచ్ మేకర్ లి మరియు మరో ఇద్దరు సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read: రాధాకృషుల ప్రేమకు సాక్ష్యంగా.. దేవతలకు ఇష్టమైన వృక్షంగా నిలిచిన కదంబ విశిష్టత ఏమిటంటే..!