Afghanistan Crisis: రెక్కలపైనే కాదు.. విమానం చక్రాల్లో కూడా కూర్చుని.. ఇప్పుడు వారు మాంసం ముద్దలుగా..

U.S. military aircraft: ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న అనంతరం అంతటా భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. ఎటుచూసినా ప్రజల రోదనలు

Afghanistan Crisis: రెక్కలపైనే కాదు.. విమానం చక్రాల్లో కూడా కూర్చుని.. ఇప్పుడు వారు మాంసం ముద్దలుగా..
Afghanistan Crisis

Edited By: Anil kumar poka

Updated on: Aug 18, 2021 | 1:17 PM

U.S. military aircraft: ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న అనంతరం అంతటా భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. ఎటుచూసినా ప్రజల రోదనలు వినిపిస్తున్నాయి. ఆఫ్ఘన్ నుంచి బయటపడేందుకు ప్రజలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కాబూల్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం నుంచి ముగ్గురు ప్రయాణికులు కిందపడి దుర్మరణ చెందిన విషయం తెలిసిందే. విమానం లోపల చోటు లభించక పోడంతో వీరంతా విమానం రెక్కలపై కూర్చున్నారు. విమానం గాలిలో టాకాఫ్ అయిన కాసేపటికే వారిలో ముగ్గురు కింద పడి మరణించగా.. దీనికి సంబంధించిన వీడియో అందరినీ కంటతడి పెట్టించింది. అయితే సీ-17 గ్లోబ్‌మాస్టర్ సైనిక విమానంపై ఎక్కిన కొంద‌రు దాన్ని వీల్ భాగంలో కూడా దాక్కున్నట్లు అమెరికా వెల్లడించింది. వారికి సంబంధించిన శరీర భాగాలు కనిపించాయని వైమానిక దళం పేర్కొంది.

కాబుల్ నుంచి సుమారు 600 మందితో వెళ్లిన ఆ విమానం ఖ‌తార్‌లోని ఆల్ ఉబెయిద్ ఎయిర్‌బేస్‌లో దిగింది. కానీ ఆ విమానం అక్కడ దిగిన త‌ర్వాత వైమానిక ద‌ళ స‌భ్యుల‌కు మ‌రో షాక్ త‌గిలింది. విమాన చ‌క్రం భాగంలో మాన‌వ శ‌రీర‌భాగాలు, అవ‌య‌వాలు క‌నిపించిన‌ట్లు వైమానిక ద‌ళం ఓ ప్రకటనలో వెల్లడించింది. స‌రుకుల‌తో వ‌చ్చిన త‌మ విమానం కాబూల్‌లో ల్యాండైన కొన్ని క్షణాల్లోనే వంద‌లాది మంది వ‌చ్చి ఎలా దాన్ని ఆక్రమించారో తెలియ‌ద‌ని అమెరికా పేర్కొంది. గ్లోబ్‌మాస్టర్ సైనిక విమానం స‌రుకును దించ‌క‌ముందే.. ఆ విమానాన్ని వంద‌లాది మంది చుట్టుముట్టారని.. దీంతో తమకేం అర్ధం కాలేదని అధికారులు పేర్కొన్నారు.

Also Read: Afghanistan Crisis: యాక్షన్.. రియాక్షన్.. తాలిబన్ల చెర నుంచి మరో నగరాన్ని స్వాధీనం చేసుకున్న ఆఫ్ఘన్ సైన్యం

Afghanistan Crisis: దారులన్నీ మూసుకుపోయాయి.. స్వదేశానికి చేర్చండి.. ఆఫ్ఘన్‌లో చిక్కుకున్న తెలుగువారి వేడుకోలు..

భర్త మరో మహిళతో ఉండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..! తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..

భార్య పేరు మీద ఇల్లు కొనుగోలు చేస్తున్నారా?.. ఆసక్తికర విషయాలు మీకోసమే..