Zero Bedroom House: ఒక్క బెడ్ రూమ్ కూడా లేని చిన్న చెక్క ఇల్లు.. కోట్లు ఖరీదు.. ఎక్కడంటే..

|

Jan 21, 2022 | 2:31 PM

Zero Bedroom House: అమెరికా(America)లో ఒక చిన్నచెక్క ఇల్లు కోట్ల ధర పలికింది. నిజానికి ఆ ఇంటిని దరిద్రపుగొట్టు ఇల్లు అంటారు అందరూ.. కారణమేదైనా ఇప్పుడు ఆ ఇల్లు ఏకంగా 14 కోట్లకు..

Zero Bedroom House: ఒక్క బెడ్ రూమ్ కూడా లేని చిన్న చెక్క ఇల్లు.. కోట్లు ఖరీదు.. ఎక్కడంటే..
Zero Bed Room House In Usa
Follow us on

Zero Bedroom House: అమెరికా(America)లో ఒక చిన్నచెక్క ఇల్లు కోట్ల ధర పలికింది. నిజానికి ఆ ఇంటిని దరిద్రపుగొట్టు ఇల్లు అంటారు అందరూ.. కారణమేదైనా ఇప్పుడు ఆ ఇల్లు ఏకంగా 14 కోట్లకు అమ్ముడిపోయి.. తనను తిట్టినవాళ్ల నోటికి తాళం పడేలా చేసింది. కాలిఫోర్నియా శాన్‌ ఫ్రాన్సిస్కోలోని నోయి వ్యాలీలో రెండు వేల చదరపు అడుగుల స్థలంలో ఓ పాడుబడిన ఇల్లు ఉంది. దీనికి ఓనర్‌ ఎవరో తెలియలేదు కానీ.. పైకి డొక్కు బిల్డింగ్‌లా..కనిపించే ఈ ఇల్లు లోపల మాత్రం మంచి ఫర్నీషింగ్‌, మోడ్రన్‌ సెటప్‌తో ఆశ్చర్యపరుస్తుంది. 122 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఇంట్లో.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కొందరు నివసించేవాళ్లట. ఇందులో కిచెన్‌, చిన్న లివింగ్‌ రూం మాత్రమే ఉన్నాయి . మొత్తం చెక్కతో నిర్మించిన ఈ ఇంటిలో ఎవరైనా నివసిస్తే.. వాళ్లను దురదృష్టం వెంటాడేదని నమ్ముతుంటారు.

అలా చాలాకాలం పాటు ఆ ఇల్లు ఖాళీగా ఉండిపోయింది. ఆ చుట్టుపక్కల ఖరీదైన ఇళ్లు ఎన్నో వెలిసినప్పటికీ.. ఆ ఇంటిని కూల్చే ధైర్యం మాత్రం ఎవరూ చేయలేకపోయారట. చివరికి ఓ పెద్దాయన ధైర్యం చేసి చాలాకాలం పాటు ఈ ఇంట్లో నివసించాడు. ఆయన నుంచి కన్జర్వేటర్‌షిప్‌ కింద ఓ వ్యక్తి ఈ ఇల్లును చేజిక్కించుకుని.. వేలం పాట నిర్వహించాడు. కంపాస్‌ అనే బ్రోకరేజ్‌ వెబ్‌సైట్‌ నుంచి జనవరి 7వ తేదీన.. ఆరు లక్షల డాలర్లపై చిలుకు విలువతో వేలం మొదలైంది. ఆ వేలంలో ఏకంగా 1.97 మిలియన్‌ డాలర్లు అంటే మన కరెన్సీలో 14 కోట్ల రూపాయలకు పైనే అమ్ముడుపోయింది. ‘పార్కింగ్‌ ప్లేస్‌ అంత లేదు.. అంత పెట్టి ఎవరు దక్కించుకున్నారు?’ అనే అనుమానాలు చాలా మందికి వచ్చాయి… కానీ, గోప్యత కారణంగా వేలంలో దక్కించుకున్న వ్యక్తి పేరు చెప్పలేదు. అయితే ఆ ఇంటిని కూలగొట్టే ఉద్దేశంగానీ, మరమ్మతులు చేసే ఉద్దేశంగానీ వేలంలో దక్కించుకున్న వ్యక్తికి లేవట!. మరి ఆ ఇల్లు ఎందుకు కొన్నట్లో..!

 

Also Read:

నాన్ వెజ్ ప్రియుల కోసం …గోదావరి జిల్లా స్టైల్ లో రుచికరమైన రొయ్యల నిల్వ పచ్చడి తయారీ..

మొదలైన భారత బ్యాటింగ్.. బౌండరీలతో దూకుడు పెంచిన ధావన్..!