Hong Kong: కరోనా విలయం.. శవపేటికల కొరతతో మార్చురీలకు పోటెత్తుతున్న శవాలు..
Hong Kong Coffins: మార్చురీలకు శవాలు భారీగా వస్తున్నాయి.. దీంతో అంత్యక్రియలు ఆలస్యమవుతున్నాయి.. కారణం శవపేటికల కొరత.. హాంకాంగ్‌లో కరోనా సృష్టించిన విలయం ఇది.
Hong Kong Coffins: మార్చురీలకు శవాలు భారీగా వస్తున్నాయి.. దీంతో అంత్యక్రియలు ఆలస్యమవుతున్నాయి.. కారణం శవపేటికల కొరత.. హాంకాంగ్‌లో కరోనా సృష్టించిన విలయం ఇది. గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్ హాంకాంగ్‌లో విషాద వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చైనాతో పాటు హాంకాంగ్‌లో కూడా కరోనావైరస్ (Coronavirus) ప్రతాపం చూపిస్తోంది. ప్రస్తుతం అక్కడ ఫిఫ్త్ వేవ్ కొనసాగుతోంది. హాంకాంగ్ వ్యాప్తంగా ఇప్పటి వరకూ ఒక మిలియన్ జనాభా కొవిడ్ బారిన పడింది.. దాదాపు 8 వేల మంది మరణించారు.. అక్కడి ప్రజలు ప్రతి రోజూ విషాదవార్తలు వినాల్సి వస్తోంది..
హాంకాంగ్‌లో కరోనా విలయంతో మరణాలు పెరిగిపోయాయి.. ఏ మార్చురీ చూసినా మృత దేహాలతో నిండిపోయి కనిస్తోంది.. అయితే అంత్యక్రియల ఏర్పాట్లలో జాప్యం తప్పడం లేదు.. ఇందుకు కారణం శవ పేటికల కొరత.. మార్చురీలో ఇంత పెద్ద సంఖ్యలో మృత దేహాలు పోడవడం గతంలో ఎన్నడూ చూడలేదంటున్నారు ఓ ప్యూనరల్ హౌస్ నిర్వాహకుడు.. అక్కడ సాధారణంగా నెలకు 15 అంత్యక్రియలు జరుగుతాయి.. గత మార్చి నెలలో ఏకంగా 40 అంత్యక్రియలు జరిగాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు..
హాంకాంగ్‌కు సాధారణ రోజుల్లో రోజుకు 250 నుంచి 300 శవపేటికలు అవసరం.. ఇప్పడు మరణాల సంఖ్య పెరగడంతో వాటికి డిమాండ్ పెరిగింది.. మార్చి 14 నుండి 26 వరకు 3,570 శవపేటికలను ఉపయోగించారు. చైనాలోని షెన్‌జెన్ నుంచి హాంకాంగ్‌కు శవపేటికలు సరఫరా అవుతాయి. అయితే చైనాలో కూడా కరోనా కేసులు పెరగడంతో వీటి రవాణా నిలిచిపోయింది.
దీంతో హాంకాంగ్‌లో అంత్యక్రియలు నిర్వహణ ఒక సమస్యగా మారిపోయింది. ఈ సమస్యను అదిగమించేందుకు అక్కడి అధికారులు చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలించడంలేదు.
Also Read: