Australia Floods: నెల వర్షం.. ఒకరోజులోనే… ఆస్ట్రేలియా సిడ్నీలో కుండపోత వర్షాలు..
Sydney Floods: అస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్ స్టేట్‌ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి.. నెలంతా కురియాల్సిన వాన ఒక్క రోజులో పడటంతో సిడ్నీ సహా పలు ప్రాంతాలు నీట మునిగాయి..
Sydney Floods: అస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్ స్టేట్‌ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి.. నెలంతా కురియాల్సిన వాన ఒక్క రోజులో పడటంతో సిడ్నీ సహా పలు ప్రాంతాలు నీట మునిగాయి.. ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్ స్టేట్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒకనెల రోజులపాటు కురిసే వర్షం ఒక్క రాత్రిలో కురిసింది. సిడ్నీ (Australia Floods) నగరంలో పాటు పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. చాలా చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. వీధులు కూడా కనిపించనంత ప్రవాహం నివాస ప్రాంతాలను చుట్టుముట్టింది. ఎక్కడ చూసినా వరద నీరే కనిపించింది. ఇళ్ల ముందు పార్క్ చేసిన వాహనాలు కూడా మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి
షోల్‌హావెన్, క్లైడ్, మోరుయా నదుల్లోకి వరద నీరు చేరడంతో నిండుగా ప్రవహించాయి.. వరద నీటిలో కొన్ని వాహనాలు కొట్టుకుపోయాయి.. ఇందులో ఉన్నవారిని పోలీసులు రక్షించారు. ఒక వ్యక్తి వరదలో కొట్టుకుపోయాడు. సెంట్రల్ న్యూ సౌత్ వేల్స్ లోని మెట్రోపాలిటన్ సిడ్నీ, ఇల్లవర్రా దక్షిణ కోస్తాలోని టేబుల్‌ల్యాండ్ ప్రాంతాలన్నీ వర నీటిలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి ఏర్పాట్లు చేశారు.. సహాయ సిబ్బందిని రంగంలోకి దింపారు.
ఒక్క రోజులో కురిసిన ఈ వర్షపాతం వార్షిక సగటు213 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ అని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఏకంగా 1226.3 MM వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని, అధికారులు హెచ్చరించారు. న్యూ సౌత్‌వేల్స్ తీర ప్రాంతంలో ఈ వర్షాలు మరో రెండు రోజుల పాటు కొనసాగుతాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Also Read: