AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UK lockdown: శాండ్‌విచ్ కోసం ఏకంగా 130 కి.మీ వెళ్లాడు.. అదికూడా హెలికాప్టర్‌లో.. వీడియో వైరల్

Helicopter pilot - sandwich: ఎవరైనా రుచికరమైన ఆహారాన్ని, పదార్థాలను తినాలనుకుంటుంటారు. ఇలాంటప్పుడు ఇష్టమైన ఫుడ్‌ తినాలనిపిస్తే.. ముందు వెనుక ఆలోచించకుండా.. ముందుకు వెళ్లిపోతుంటారు. ఆ ఆహారం వేరే..

UK lockdown: శాండ్‌విచ్ కోసం ఏకంగా 130 కి.మీ వెళ్లాడు.. అదికూడా హెలికాప్టర్‌లో.. వీడియో వైరల్
Shaik Madar Saheb
|

Updated on: Mar 08, 2021 | 9:35 PM

Share

Helicopter pilot – sandwich: ఎవరైనా రుచికరమైన ఆహారాన్ని, పదార్థాలను తినాలనుకుంటుంటారు. ఇలాంటప్పుడు ఇష్టమైన ఫుడ్‌ తినాలనిపిస్తే.. ముందు వెనుక ఆలోచించకుండా.. ముందుకు వెళ్లిపోతుంటారు. ఆ ఆహారం వేరే ప్రదేశంలో ఉందన్నా కాస్త రిస్క్‌ చేసైనా అక్కడకు వెళ్లి తినేసి వస్తుంటారు. అది కూడా ఓ 10,20 ఇంకా 50 కిలోమీటర్ల అయినా పెద్ద పట్టించుకోకుండా.. వెళ్లి ఆ ఫుడ్‌‌ను ఆస్వాదిస్తూ తిని వస్తుంటారు. కానీ ఓ వ్యక్తి.. తనకు ఎంతో ఇష్టమైన శాండ్విచ్‌ కోసం.. ఏకంగా 128 కిలోమీటర్లు వెళ్లాడు. అదికూడా అతను వెళ్లింది ఓ హెలిక్యాప్టర్‌లో. అవును మీరు చదివింది ముమ్మాటికీ నిజం. కరోనా లాక్‌డౌన్ కారణంగా.. తనకిష్టమైన శాండ్‌విచ్ తినాలని ఓ వ్యక్తి హెలికాప్టర్‌లో ప్రయాణించాడు. ఈ సంఘటన యూకేలో జరిగింది.

కరోనా నిబంధనలు ఉండటతో యూకే జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి స్వయంగా హెలికాప్టర్ వేసుకోని వెళ్లి మరి శాండ్‌విచ్ కొనుగోలు చేశారు. ఇటీవల యూకేలోని లాంక్షైర్‌లో చిప్పింగ్ ఫార్మ్ షాప్ ముందు ఓ హెలికాప్టర్ ఆగింది. అందులో నుంచి దర్జాగా దిగిన ఓ వ్యక్తి శాండ్‌విచ్‌ను ఆర్డర్ చేశాడు. అనంతరం ఆ పార్శిల్ పట్టుకుని మళ్లీ హెలికాప్టర్‌లో వెనుతిరిగాడు. చిప్పింగ్ ఫార్మ్ షాప్ యాజమాన్యం ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ప్రస్తుతం యూకేలో లాక్‌డౌన్ నడుస్తున్న నేపథ్యంలో ఆ పైలట్ ఇలా హెలికాప్టర్‌లో వచ్చాడని నిర్వాహకులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్‌ మాత్రం.. క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే, తమకు నచ్చిన ఆహారం కోసం దూర ప్రయాణాలు చేయడం ఇదే తొలిసారి కాదు. 2020లో ఇలాంటివి చాలానే జరిగాయి. అయితే ఈ వ్యక్తికి గ్రేటర్ మాంచెస్టర్‌లోని సిటీ విమానాశ్రయం నుంచి ఫ్లైట్-ట్రాకింగ్ వెబ్‌సైట్‌ను ఉపయోగించి రెస్టారెంట్ కు చేరుకున్నాడని సమాచారం. ఏదీఏమైనప్పటకీ.. ఈ వీడియో బాగా చక్కెర్లు కొడుతోంది. మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కెయండి.

Also Read:

Alzheimers: ఈ ఆహార పదార్థాలను దూరం పెట్టండి.. లేకపోతే ‘అల్జీమర్స్’ బారిన పడినట్లే.. ఎందుకంటే..?

Benefits of Eggs: ప్రతీరోజూ మూడు గుడ్లు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే వదిలిపెట్టరు..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!