తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Tesla CEO Elon Musk) తోసిపుచ్చారు. తనపై వచ్చిన ఆ ఆరోపణల్లో నలుసంత నిజం కూడా లేదంటూ కొట్టిపారేశారు. 2016లో ఓ ప్రైవేటు జెట్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఎలాన్ మస్క్ అందులో ప్రయాణిస్తున్న తన సహాయకురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని అంతర్జాతీయ మీడియా(Business Insider)లో ఓ సంచలన కథనం వెలువడింది. బాధితురాలికి రెండున్నర లక్షల డాలర్లు చెల్లించి ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సెటిల్‌మెంట్ చేసుకున్నట్లు ఆ కథనం తెలిపింది. ఎలాన్ మస్క్ చేతిలో లైంగిక వేధింపులకు గురైన బాధితురాలి ఫ్రెండ్‌ను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా ఈ కథనం ప్రచురించింది. అయితే తనపై వచ్చిన ఈ సంచలన ఆరోపణలు పూర్తి అసత్యాలుగా మస్క్ ట్వీట్ చేశారు. తనపై ఈ ఆరోపణలను నిరూపించగలరా? అంటూ సవాల్ చేశారు. తనపై ఆరోపణలు చేస్తున్న అబద్ధాలకోరు.. బయటకు కనిపించని తన శరీరంపై ఉన్న టాటూస్, మానిన గాయానికి సంబంధించిన మార్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో? చెప్పాలన్నారు. ఆ ఆరోపణల్లో వాస్తవం లేనందున.. ఇవి చెప్పలేరని పేర్కొన్నాడు.
But I have a challenge to this liar who claims their friend saw me “exposed” – describe just one thing, anything at all (scars, tattoos, …) that isn’t known by the public. She won’t be able to do so, because it never happened.
ఇవి కూడా చదవండి— Elon Musk (@elonmusk) May 20, 2022
ట్విట్టర్ కొనుగోలు డీల్‌ను ప్రభావితం చేసేందుకే ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని ఎలాన్ మస్క్ పేర్కొన్నాడు. స్నేహితురాలి పేరిట తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తి లాస్ ఏంజెల్స్‌కు చెందిన వాపపక్ష భావజాలం కలిగిన నటిగా ఆరోపించారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని తేటతెల్లం అవుతోందన్నారు.
No, it was clear that their only goal was a hit price to interfere with the Twitter acquisition. The story was written before they even talked to me.
— Elon Musk (@elonmusk) May 20, 2022
మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి