Mohammed Deif: హమాస్‌కు దెబ్బ మీద దెబ్బ.. మిలటరీ చీఫ్‌ మహ్మద్‌ డీఫ్‌ దుర్మరణం! ఇజ్రాయెల్‌ మిలిటరీ వెల్లడి

|

Aug 01, 2024 | 7:12 PM

ఇజ్రాయెల్‌పై పోరాడుతున్న హమాస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే సంస్థ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా ఇరాన్‌లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా హమాస్‌ మిలటరీ చీఫ్‌ మహ్మద్‌ డీఫ్‌ సైతం మృతి చెందాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ మిలిటరీ గురువారం (ఆగస్టు 1) అధికారికంగా ధ్రువీకరించింది. గత నెలలో గాజా దక్షిణ ప్రాంతంలోని ఖాన్ యూనిస్‌లో గత నెలలో జరిపిన దాడిలో హమాస్ మిలిటరీ చీఫ్ మహ్మద్ దీఫ్ మరణించినట్లు..

Mohammed Deif: హమాస్‌కు దెబ్బ మీద దెబ్బ.. మిలటరీ చీఫ్‌ మహ్మద్‌ డీఫ్‌ దుర్మరణం! ఇజ్రాయెల్‌ మిలిటరీ వెల్లడి
Mohammed Deif
Follow us on

ఇజ్రాయెల్‌పై పోరాడుతున్న హమాస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే సంస్థ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా ఇరాన్‌లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా హమాస్‌ మిలటరీ చీఫ్‌ మహ్మద్‌ డీఫ్‌ సైతం మృతి చెందాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ మిలిటరీ గురువారం (ఆగస్టు 1) అధికారికంగా ధ్రువీకరించింది. గత నెలలో గాజా దక్షిణ ప్రాంతంలోని ఖాన్ యూనిస్‌లో గత నెలలో జరిపిన దాడిలో హమాస్ మిలిటరీ చీఫ్ మహ్మద్ దీఫ్ మరణించినట్లు ఎక్స్ వేధికగా వెల్లడించింది. టెహ్రాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హతమార్చిన ఒక రోజు తర్వాత డీఫ్‌ను కూడా చంపినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం పేర్కొంది.

ఈ ఏడాది జూలై 13న ఐడీఎఫ్‌ ఫైటర్‌ జెట్లు దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్‌ ప్రాంతంలో బ్రిగేడ్‌ కమాండర్‌ మొహ్మద్‌ డీఫ్‌, రఫా సలామెహ్‌ ఉన్న కాంపౌండ్‌పై దాడి చేసింది. ఈ ఘటనలో మొహ్మద్‌ డీఫ్‌ ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. డీఫ్‌ను హతమార్చేందుకు ఇజ్రాయెల్‌ ఇప్పటికి ఏడుసార్లు ప్రయత్నించింది. ఇజ్రాయెల్‌పై అక్టోబర్‌ 7న హమాస్‌ భారీగా మిస్సైళ్లతో దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఈ దాడుల వెనుక డీఫ్‌ సూత్రధారిగా ఇజ్రాయెల్‌ భావిస్తున్నారు. ఇజ్రాయెల్ అధికారిక గణాంకాల ఆధారంగా AFP లెక్కల్లో దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి ఘటనలో 1,197 మంది మరణించారు. డీఫ్ ఈ మారణకాండకు ప్లాన్ చేసి, అమలు చేశాడు.

ఇవి కూడా చదవండి

మరోవైపు డీఫ్‌ మరణ వార్తలను హమాస్‌ ఖండించింది. జులై 13 నాటి దాడిలో దాదాపు 90 మందికిపైగా మరణించారని, అయితే అందులో డీఫ్‌ లేడని కొట్టిపారేసింది. కాగా 3 దశాబ్దాలుగా ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా, అంతర్జాతీయ తీవ్రవాదుల జాబితాలో డీఫ్‌ పేరు ముందువరుసలో ఉంది. ఇజ్రాయెల్‌పై అనేక సంవత్సరాలుగా డీఫ్ అనేక దాడులు నిర్వహించినట్లు మిలటరీ తెలిపింది. గాజాలోని హమాస్ అధిపతి యాహ్యా సిన్వార్‌తో కలిసి డీఫ్ కుట్రలు చేసి, గతంలో పలు ఆత్మాహుతి బాంబు దాడుల్లో డజన్ల కొద్దీ ఇజ్రాయిలీల ప్రాణాలు తీసినట్లు మిలిటరీ తెలిపింది. హమాస్ దాడి సమయంలో మిలిటెంట్లు 251 మందిని స్వాధీనం చేసుకున్నారు. 111 మంది ఇప్పటికే గాజాలో బందీలుగా ఉన్నారు. ఇందులో 39 మంది చనిపోయారని మిలటరీ తెలిపింది. ఇందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ 39,480 మందిని చంపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.