USA Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తానా డైరెక్టర్‌ శ్రీనివాస్‌ భార్య, ఇద్దరు కూమార్తెలు మృతి..

|

Sep 27, 2022 | 10:20 AM

USA Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్సాస్‌ వాలర్‌ కౌంటీలో జరిగిన యాక్సిడెంట్‌లో తానా బోర్డ్‌ డైరెక్టర్‌ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్‌..

USA Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తానా డైరెక్టర్‌ శ్రీనివాస్‌ భార్య, ఇద్దరు కూమార్తెలు మృతి..
Car Accident
Follow us on

USA Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్సాస్‌ వాలర్‌ కౌంటీలో జరిగిన యాక్సిడెంట్‌లో తానా బోర్డ్‌ డైరెక్టర్‌ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్‌(Tana Board Director Kodali Nagendra Srinivas) భార్య, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. వివరాల్లోకెళితే.. కృష్ణాజిల్లా కురుమద్దాలికి చెందిన డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్‌.. హోస్టన్‌లో నివాసముంటున్నారు. ఆయన భార్య వాణి ఐటీ ఉద్యోగి. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్దమ్మాయి మెడిసిన్‌ చదువుతోంది. చిన్నమ్మాయి ప్లస్ వన్ చదువుతోంది. అయితే, దసరా పండుగ నేపథ్యంలో పెద్దమ్మాయిని ఇంటికి తీసుకురావడానికి వాణి, ఆమె చిన్న కూతురు కారులో వెళ్లారు. పెద్దమ్మాయిని తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు స్పాట్‌లోనే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రమాదంలో కుటుంబాన్ని కోల్పోయి షాక్‌లోకి వెళ్లిపోయారు నాగేంద్ర శ్రీనివాస్‌. ఈ ప్రమాదపై తానా సభ్యులతో పాటు, అక్కడి తెలుగువారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. తానా సభ్యులు సహా, అక్కడి తెలుగు సంస్థలు, తెలుగువారు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ ప్రమాదంపై తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కురుమద్దాలికి చెందిన కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ గుంటూరు మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివారు. అనంతరం ఉన్నత విద్యనభ్యసించేందుకు 1995లో అమెరికాకు వెళ్లారు. పీడియాట్రిక్‌ కార్డియోవాస్క్యులర్‌ అనస్థీషియాలజిస్ట్‌గా గుర్తింపుపొందారు. కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలోని హ్యూస్టన్‌‌ల స్థిరపడ్డారు. 2017 నుంచి తానా బోర్డు సభ్యునిగా సేవలు అందిస్తున్న ఆయన.. డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. తాజా ఘోర ప్రమాదంలో కుటుంబం మొత్తాన్ని కోల్పోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎన్ఆర్ఐ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..