TANA Conference: తానా వేడుకల్లో ధ్యానం,  ఆధ్యాత్మికత ఆవశ్యకతను చెప్పే కార్యక్రమం.. పాల్గొననున్న సద్గురు, దాజీ కమలేష్

|

Jun 29, 2023 | 12:08 PM

ఉత్తర అమెరికాలోని తెలుగు ప్రజలు తెలుగు  సంస్కృతిని, సాంస్కృతికతను, సాహిత్యాన్ని, విద్య, సహా తెలుగు వారి వారసత్వాన్ని పరిరక్షిస్తూ భావితరాలకు అందిస్తున్న తానా 23వ మహాసభలకు  ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌ వేదిక కానుంది. ఈ వేడుకలను జూలై 7, 8, 9 తేదీల్లో నిర్వహించడానికి తానా నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు

TANA Conference: తానా వేడుకల్లో ధ్యానం,  ఆధ్యాత్మికత ఆవశ్యకతను చెప్పే కార్యక్రమం.. పాల్గొననున్న సద్గురు, దాజీ కమలేష్
Tana Conference 2023
Follow us on

అమెరికాలో స్థిరపడిన తెలుగువారు తమ మూలలను మరచిపోకుండా భావితరాలకు తెలుగు విశిష్టతను , తెలుగు వారి  గొప్పదనాన్ని తెలియజేయడానికి ఏర్పాటైన సంఘం ఉత్తర అమెరికా తెలుగు సంఘం. దీనినే తానా అని పిలుస్తారు కూడా.. 1977 లో మొదలైన తానా జర్నీ… తాజాగా తానా తన 23వ ఆవిర్భావ వేడుకలను జరుపుకోవడానికి సిద్దమవుతుంది.

ఉత్తర అమెరికాలోని తెలుగు ప్రజలు తెలుగు  సంస్కృతిని, సాంస్కృతికతను, సాహిత్యాన్ని, విద్య, సహా తెలుగు వారి వారసత్వాన్ని పరిరక్షిస్తూ భావితరాలకు అందిస్తున్న తానా 23వ మహాసభలకు  ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌ వేదిక కానుంది. ఈ వేడుకలను జూలై 7, 8, 9 తేదీల్లో నిర్వహించడానికి తానా నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న రాణించిన ప్రాముఖులను వివిధ పురస్కారాల్లో సత్కరించనున్నారు. ఈ మేరకు సినీ, సాహిత్య, ఆధ్యాత్మిక సహా అనేక  రంగాల్లోని ప్రముఖులను ఆహ్వానించారు.

అయితే తానా మహా సభ వేడుకల్లో జూలై 8వ తేదీ రాత్రి 7:00 గంటలకు జ్ఞానోదయాన్ని తెలుసుకోండి.. మీలో చైతన్యాన్ని పెంచుకోండి అనే పేరుతో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రాముఖ్య ఆధ్యాత్మిక గురువు శ్రీ సద్గురు జగ్గీ వాసుదేవ్, దాజీ కమలేష్ పటేల్ పాల్గొననున్నారు. ధ్యానం,  ఆధ్యాత్మికత ఆవశ్యకతను ఆహుతులను అందించనున్నారు. మానవులకు స్ఫూర్తిని, ఉత్తేజాన్ని నింపి జీవితంలో పరివర్తన తెచ్చే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తానా నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..