Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gulf Stories: గల్ఫ్ లో ఉద్యోగమా? ఈ లెక్కలు, చిక్కులు చూడండి!

Gulf Stories: గల్ఫ్ లో ఉద్యోగమా? ఈ లెక్కలు, చిక్కులు చూడండి!

Gunneswara Rao
| Edited By: TV9 Telugu|

Updated on: Jun 21, 2024 | 3:59 PM

Share

గల్ఫ్ దేశాలలో ఒమన్, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్.. ఈ ఆరు దేశాలు కలిసి 1981లో ఓ కౌన్సిల్ గా ఏర్పడ్డాయి. దాని పేరు గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్. సింపుల్ గా చెప్పాలంటే జీసీసీ. ఈ దేశాలకు వలస వెళ్లిన మనవారి సంఖ్య తక్కువేమీ కాదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే దాదాపు 90 లక్షల మంది ఉన్నారు.

గల్ఫ్ దేశాలలో ఒమన్, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్.. ఈ ఆరు దేశాలు కలిసి 1981లో ఓ కౌన్సిల్ గా ఏర్పడ్డాయి. దాని పేరు గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్. సింపుల్ గా చెప్పాలంటే జీసీసీ. ఈ దేశాలకు వలస వెళ్లిన మనవారి సంఖ్య తక్కువేమీ కాదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే దాదాపు 90 లక్షల మంది ఉన్నారు. ఈ దేశాలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోనే ఎక్కువమంది వలస శ్రామికులు ఉన్నారు. మన వారితో పాటు మన ఇరుగుపొరుగు దేశాల నుంచీ జీసీసీ దేశాలకు వలస వెళ్తుంటారు. ఇందులో కువైట్ కే తాకిడి ఎక్కువగా ఉంటుంది. అక్కడ మనవాళ్లు సుమారు 10 లక్షల మంది ఉంటారు. ఇక జీసీసీ దేశాలకు కేరళ, గోవా నుంచి ఎక్కువగా వలసలు ఉంటాయని చెప్పాలి. ఇక్కడ సమస్య ఏమిటంటే.. గల్ఫ్ దేశాల్లోని ఉద్యోగాల్లో సింహ భాగం.. శారీరక శ్రమ ఎక్కువగా ఉండేవే. కొన్నాళ్ల కిందటి వరకు కేరళ నుంచి వలసలు ఎక్కువగా ఉన్నా.. ఇప్పుడు ఆ స్థానాన్ని ఉత్తరాది రాష్ట్రాలు క్రాస్ చేస్తున్నాయి. యూపీతో పాటు బీహార్ కూడా ఇందులో పోటీ పడుతోంది. ఎక్కువగా నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు ఉంటున్నాయి. అందుకే ఈ రంగంలో ఉద్యోగాల కోసం ఈ రెండు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్, తమిళనాడు వాసులు కూడా పోటీ పడుతున్నారు. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమిటంటే.. గల్ఫ్ దేశాల్లో...

Published on: Jun 21, 2024 03:57 PM