Kyrgyzstan Violence: కిర్గిస్థాన్‌లో కొనసాగుతున్న విద్యార్థుల కష్టాలు.. ఘటనలపై ఆరా తీసిన తెలంగాణ సీఎం రేవంత్

|

May 21, 2024 | 8:56 AM

కిర్గిస్థాన్‌లో ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. పలుచోట్ల విదేశీ విద్యార్థులు ఉన్న ప్రాంతాల్లో భద్రతను పెంచినప్పటికీ.. వారంతా హాస్టల్ గదులకే పరిమితం కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ఘటనలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సైతం ఆరా తీశారు.

Kyrgyzstan Violence: కిర్గిస్థాన్‌లో కొనసాగుతున్న విద్యార్థుల కష్టాలు.. ఘటనలపై ఆరా తీసిన తెలంగాణ సీఎం రేవంత్
Revanth On Kyrgyzstan Violence
Follow us on

కిర్గిస్థాన్‌లో ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. పలుచోట్ల విదేశీ విద్యార్థులు ఉన్న ప్రాంతాల్లో భద్రతను పెంచినప్పటికీ.. వారంతా హాస్టల్ గదులకే పరిమితం కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ఘటనలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సైతం ఆరా తీశారు.

కిర్గిస్థాన్‌లో భారతీయ విద్యార్థుల కష్టాలు కొనసాగుతున్నాయి. గత శుక్రవారం సాయంత్రం నుంచి కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో విదేశీ విద్యార్థులపై మూకదాడులు జరుగుతున్నాయి. పలుచోట్ల విదేశీ విద్యార్థులు ఉన్న ప్రాంతాల్లో భద్రతను పెంచినప్పటికీ.. వారంతా హాస్టల్ గదులకే పరిమితం కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కిర్గిస్థాన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం మాత్రం అక్కడ పరిస్థితి అదుపులో ఉందని తెలిపింది. విద్యార్థులకు సమస్యలు ఉంటే తమను సంప్రదించాలని కోరింది.

కిర్గిస్థాన్ ఘటనలపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఆరా తీశారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు బిష్కెక్‌లోని భారత రాయబారితో మాట్లాడారు. అక్కడ జరిగిన ఘటనల్లో భారతీయ విద్యార్థులు ఎవరూ గాయపడలేదని.. అంతా క్షేమంగానే ఉన్నారని రాయబారి తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి కిర్గిస్థాన్ వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతుండటంతో సీఎం రేవంత్‌ స్పందించారు.

కిర్గిస్థాన్‌లో తెలంగాణ విద్యార్థుల భద్రత కోసం వెంటనే పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు మాజీమంత్రి హరీష్‌రావు. కిర్గిస్థాన్‌లో భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న హింసాత్మక సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. విద్యార్థుల భద్రతపై వారి కుటుంబాలకు భరోసా ఇవ్వడానికి సీఎం కార్యాలయంతో పాటు భారత విదేశాంగ మంత్రి జైశంకర్, బిష్కెక్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు దౌత్యపరంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కిర్గిస్థాన్‌లో చదువుకుంటున్న 2000 మంది ఏపీ విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు కేంద్రాన్ని కోరారు. జీవీఎల్ విజ్ఞప్తికి కేంద్ర విదేశాంగమంత్రి జైశంకర్ సానుకూలంగా స్పందించారు.

కిర్గిస్థాన్‌లో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ఒక విద్యార్థి తనకు ఫోన్ చేసి ఐదు రోజులుగా ఏమీ తినలేదని చెప్పినట్లు ఆయన తెలిపారు. మన విద్యార్థుల రక్షణ కోసం కేంద్ర మంత్రి జైశంకర్ చర్యలు తీసుకోవాలని కోరారు. అక్కడి పరిస్థితులు మెరుగుపడకపోతే భారతీయ విద్యార్థుల్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయాలని కోరారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…