లండన్‌లో తెలుగమ్మాయి దారుణ హత్య.. పాపం, ఎంఎస్ చదువుకోవడానికి వెళ్లి..

|

Jun 14, 2023 | 12:23 PM

Hyderabad News: లండన్‌లో తెలుగు అమ్మాయి తేజస్విని రెడ్డి దారుణ హత్యకు గురైంది. బ్రెజిల్‌కు చెందిన యువకుడు తేజస్విని రెడ్డితో పాటు మరో యువతి అఖిలపై కత్తితో దాడి చేశాడు.

లండన్‌లో తెలుగమ్మాయి దారుణ హత్య.. పాపం, ఎంఎస్ చదువుకోవడానికి వెళ్లి..
Crime News
Follow us on

Hyderabad News: లండన్‌లో తెలుగు అమ్మాయి తేజస్విని రెడ్డి దారుణ హత్యకు గురైంది. బ్రెజిల్‌కు చెందిన యువకుడు తేజస్విని రెడ్డితో పాటు మరో యువతి అఖిలపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలైన తేజస్వినిని హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. కానీ, అప్పటికే పరిస్థితి విషమంచి తేజస్విని చనిపోయినట్లు లండన్ పోలీసులు వెల్లడించారు. మరో యువతికి తీవ్రగాయాలయ్యాయని పేర్కొన్నారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బ్రాహ్మణపల్లికి చెందిన తేజస్విని.. లండన్‌లో ఎమ్మెస్‌ చదువుతోంది. తండ్రి అనారోగ్యం కారణంగా ఆరునెలల క్రితమే ఇంటికి వచ్చి తిరిగి వెళ్లిపోయింది. అంతలోనే తేజస్విని మరణవార్త వినాల్సి వస్తుందని ఊహించలేదంటూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరో రెండు నెలల్లో కోర్సు పూర్తి చేసుకుని ఇంటికి రావాల్సి ఉన్న తమ బిడ్డ ఇక లేదనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తేజస్పిని కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు.

తేజస్వినికి సంబంధాలు కూడా చూస్తున్నారు కుటుంబసభ్యులు. అంతలోనే దారుణం జరిగిపోయిందంటూ గుండెలు బాదుకుంటున్నారు. దీంతో బ్రహ్మణపల్లిలో విషాదం చోటుచేసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..