Bonalu 2022: లండన్ వీధుల్లో బోనాల సంబరాలు.. ప్రత్యేక ఆకర్షణగా పోతురాజు విన్యాసాలు..
Bonalu 2022: లండన్‌లో నివాసం ఉంటున్న తెలంగాణ వాసులు బోణాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో మంగళవారం బోనాల...
Bonalu 2022: లండన్‌లో నివాసం ఉంటున్న తెలంగాణ వాసులు బోణాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో మంగళవారం బోనాల జాతరను లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. లండన్ నలుమూలల నుంచి సుమారు 1000కి పైగా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలకు స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా , రూత్ కాడ్బరి, హౌన్సలౌ డిప్యూటీ మేయర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
స్వదేశంలో జరుపుకున్నట్లుగానే సంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించారు. లండన్ వీదుల్లో తొట్టెల ఊరేగింపు, ముఖ్యంగా పోతురాజు ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లండన్‌కి ఉన్న చదువుల కోసం వెళ్లిన తెలంగాణ విద్యార్థి అక్షయ్ మల్చేలం, వారి వంశ వృత్తిని కొనసాగిస్తూ పోతురాజు వేషదారణలో బోనాల ఊరేగింపులో పాల్గొని వేడుకలకు కొత్త శోభ తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా భారత సంతతికి చెందిన స్థానిక ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ.. ‘యూకే లో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారు. వీరి స్ఫూర్తి చాలా గొప్పది. విదేశాల్లో ఉన్నపటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్తున్నా తీరు చాలా గొప్పగా ఉంది. లండన్ వీధుల్లో బోనాల తొట్టెల ఊరేగింపు చూసి చాలా గర్వపడుతున్నా’నని చెప్పుకొచ్చారు.
ఇక వేడుకలను ఘనంగా నిర్వహించిన టాక్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలంపై ఎంపీ వీరేంద్ర శర్మ ప్రశంసలు కురిపించారు. లండన్ లో ఉంటూ తెలంగాణ రాష్త్ర సాధన కోసం ఎంతో శ్రమించిన నాయకుడని, తరువాత తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్యత గురించి ప్రపంచ వేదికల్లో వినూత్నంగా పరిచయం చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి ప్రవాసులకు వారదిగా ఉంటూ ఎంతో కష్ట పడి పని చేశారని అభినందించారు. అనిల్ కష్టాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం TSFDC చైర్మన్ గా సమున్నత స్థానం కల్పించడం ఆనందకరమైన విషయం అని కొనియాడారు.
మరిన్ని ఇంటర్నేషనల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..