Gujarati family found dead: అమెరికా-కెనడా సరిహద్దుల్లో ఓ భారతీయ కుటుంబం మృత్యువాత పడింది. మృతుల్లో పసికందు సహా దంపతులు, ఓ యువకుడు ఉన్నారు. వీరంతా గుజరాత్‌కు చెందిన వారని అధికారులు తెలిపారు. మానవ అక్రమ రవాణాలో భాగంగా కెనడా భూభాగం నుంచి అమెరికాకు అక్రమంగా ప్రవేశించే క్రమంలో మరణించారని అధికారులు వెల్లడించారు. ఎమర్సన్ ప్రాంతం వద్ద కెనడా భూభాగంలో వారి మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు.
రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికా సరిహద్దుకు 12 మీటర్ల దూరంలోనే ఓ పురుషుడు, మహిళ, ఒక టీనేజర్, ఒక శిశువు మృతదేహాలు ఘతపతాలీ. ఎమర్సన్ వద్ద మానవ అక్రమ రవాణాలోని ఓ సమూహం సరిహద్దు దాటే ప్రయత్నం చేసిందని.. ఈ క్రమంలో భారతీయ కుటుంబం చనిపోయినట్లు కెనడా పోలీసులు పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని అరెస్టు చేసినట్లు యూఎస్ పోలీసులు తెలిపారు. రెండు ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో ఏడుగురు భారతీయులు సహా.. మరికొంత మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. భారతీయులంతా గుజరాత్‌కు చెందిన వారని పేర్కొన్నారు. వీరంతా కెనడా నుంచే అక్రమంగా వచ్చినట్లు తెలిపారు.
కాగా.. ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపాలని కోరారు.
Also Read: