Frida Kahlo Painting: రూ. 260 కోట్లకు అమ్ముడైన పెయింటింగ్.. దీని స్పెషాలిటీ ఏమిటో తెలుసా..

|

Nov 18, 2021 | 8:11 AM

Frida Kahlo Painting: ఏవైనా సరే కొంచెం కష్టపడితే.. మంచి విజ్ఞాన వంతుడుకావచ్చు.. అయితే కళాకారుడుగా కావాలంటే మాత్రం.. జన్మతః రావాల్సిందే అది దేవుడిచ్చిన వరం ..

Frida Kahlo Painting: రూ. 260 కోట్లకు అమ్ముడైన పెయింటింగ్.. దీని స్పెషాలిటీ ఏమిటో తెలుసా..
Frida Kahlo Painting
Follow us on

Frida Kahlo Painting: ఏవైనా సరే కొంచెం కష్టపడితే.. మంచి విజ్ఞాన వంతుడుకావచ్చు.. అయితే కళాకారుడుగా కావాలంటే మాత్రం.. జన్మతః రావాల్సిందే అది దేవుడిచ్చిన వరం అంటారు పెద్దలు. అందుకనే మన సమాజంలో కళాకారులను గౌరవిస్తాం.. వారి ప్రతిభకు పట్టం గడతాం.. ఎన్ని సంవత్సరాలు అయినా కళాకారుడిని గుర్తు చేసుకుంటూనే ఉంటాయి. తాజాగా ఒక ప్రఖ్యాత కళాకారిణి వేసిన పెయింటింగ్‌ ఏకంగా కోట్లలో అమ్ముడు పోయింది. న్యూయార్క్‌లో నిర్వహించిన ఓ వేలంలో మెక్సికన్‌కి చెందిన ప్రముఖ కళాకారిణి ఫ్రిదా కహ్లో వేసిన అరుదైన పెయింటింగ్ 35 మిలియన్‌ డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే మన భారత దేశ కరెన్సీలో సుమారు 260 కోట్లు అన్నమాట. ఇంతకీ ఈ పెయింటింగ్‌ గొప్పతనమేంటో తెలుసా.. ఈ కళాకారిణి తన చిత్రాన్ని తానే చిత్రించడమే కాకుండా అందులో తన భర్త ముఖం తన నుదిటి పై ప్రతిబింబించేలా పెయింటింగ్‌ వేసింది.

పైగా ఈ పెయింటింగ్‌లో ఆమె విలక్షణమైన కనుబొమ్మలతో ఉన్న ఆ కళ్లనుండి కొన్ని కన్నీటి చుక్కలు వస్తున్నట్లు చిత్రించింది. అంతేకాదు ఆమె ఈ పెయింటింగ్‌ని తన భర్త పేరుతో చిత్రించింది. అయితే ఆమె భర్త డియెగో రివెరా మరో మహిళతో సన్నిహితంగా మెలగడంతోనే ఆమె ఈ విధంగా తన భర్త ముఖాన్ని తన నుదిటపై మూడవ కన్నుగా చిత్రీకరించిందంటూ కొంతమంది కళాకారులు అభిప్రాయపడుతుంటే… ఈ పెయింటింగ్‌ ఆమెను తన భర్త ఏ స్థాయిలో హింసించాడో సూచిస్తుందంటున్నారు. కాగా ఈ పెయింటింగ్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదకు అమ్ముడుపోయిన లాటిన్‌ అమెరికా కళాకృతిగా నిలవడం విశేషం.

Also Read:  దేశవ్యాప్తంగా నెల రోజుల వ్యవధిలో 25 లక్షలకు పైగా పెళ్ళిళ్లు.. ఎంత వ్యాపారం జరిగిందో తెలిస్తే షాక్!