
వివిధ రంగాలకు సంబంధించి నోబెల్ పురస్కారాలను ఈ మధ్య కాలంలో ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు వైద్యం, భౌతిక, రసాయన శాస్త్రాల్లో నోబెల్ బహుమతిని ప్రకటించగా.. తాజాగా సాహిత్య రంగానికి సంబంధించిన నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు. సాహిత్యంలో ఫ్రాన్స్‌కు చెందిన రచయిత్రి అనీ ఎర్నాక్స్ కు ప్రపంచ అత్యున్నత నోబెల్ పురస్కారం దక్కింది. జ్ఞాపకశక్తి మూలాలపై ఆమె రచించిన ‘ఫర్ ద కరేజ్ అండ్ క్లినికల్లీ ఏక్యుటీ’ పుస్తకానికి గాను నోబెల్ బహుమతి వరించింది. సాహిత్య రంగంలో అనీ ఎర్నాక్స్ చేసిన విశేష సేవలకు గాను ఈ ఏడాది నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. లింగం, భాష, వర్గం అంశాలపై స్వీయ అనుభవాలతో విభిన్న కోణాల నుంచి విశ్లేషిస్తూ చేసే రచనలతో ఆమె పేర్గాంచారు. 1940లో నార్మాండీలోని యెవెటోట్ అనే చిన్న పట్టణంలో ఎర్నాక్స్ పుట్టి పెరిగారు. అక్కడే తల్లిదండ్రులతో కలిసి ఓ దుకాణం, కేఫ్‌ను నడుపుతోన్న ఎర్నాక్స్ రచయిత్రి వైపు సాగించిన ప్రయాణం ఎంత సుదీర్ఘమైనది, కష్టంతో కూడుకున్నది కూడా. ఆమె 30కి పైగా సాహిత్య రచనలు చేశారు.
గత కొన్నేళ్లుగా నోబెల్ పురస్కారం ఎర్నాక్స్‌కు వస్తుందంటూ ఊహాగానాలు వినిపించేవి. ఎట్టకేలకు ఆఊహగానాలు నిజమయ్యాయి. 1901 నుంచి ఇప్పటివరకు 119మందికి సాహిత్య నోబెల్ పురస్కారాలు ప్రదానం చేయగా.. ఈ జాబితాలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైన 17వ మహిళగా ఎర్నాక్స్ నిలిచారు. ఇప్పటివరకు వైద్యం, భౌతిక, రసాయనశాస్త్రాలతో పాటు సాహిత్య నోబెల్ బహుమతుల విజేతలను ప్రకటించారు. ఆర్థికరంగం, శాంతి బహుమతులకు ఎంపికైన వారి పేర్లను వెల్లడించాల్సి ఉంది. నోబెల్ బహుమతి గ్రహీతలకు 10లక్షల స్వీడిష్ క్రోనర్ సుమారు 9లక్షల డాలర్లు నగదు అందజేస్తారు.
అనీ ఎర్నాక్స్ 1974లోనే రచనలు మొదలు పెట్టారు. ఆమె తన 82వ ఏట నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. సాహిత్యంలో ప్రొఫెసర్ గా పనిచేసిన ఎర్నాక్స్.. ప్రధానంగా ఆటో బయోగ్రఫీలు రాశారు. తన తల్లిదండ్రులతో తన అనుబంధం, తదనంతరం తన జీవితంలో చోటుచేసుకున్న పరిణామాల ఆధారంగా ఎన్నో రచనలు చేశారు.
The 2022 #NobelPrize laureate in literature Annie Ernaux believes in the liberating force of writing. Her work is uncompromising and written in plain language, scraped clean. pic.twitter.com/la80uMiSa8
— The Nobel Prize (@NobelPrize) October 6, 2022
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..