AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా సామిరంగ రెచ్చిపోవుడే.. ఉద్యోగులకు ఐటీ కంపెనీ బంపర్ ఆఫర్.. ఇకపై ఆ లీవ్‌లు కూడా..

అసలే ఐటీ కంపెనీ.. పని ఒత్తిడి ఫుల్.. ఎంటర్టైన్‌మెంట్ నిల్.. ఇలాంటి పరిస్థితుల్లో వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఉద్యోగులు రిలాక్స్ అయ్యేందుకు ఎంజాయ్.. పండగో అనాల్సిందే.. మంచిగా రెండు రోజుల పాటు చిల్ అవుతుంటారు.. మరుసటి రోజు నుంచి మళ్లీ యథామామూలే.. ఎప్పటి లాగే డ్యూటీ చేయాల్సిందే.. మళ్లీ వీకెండ్ కోసం ఎదురుచూస్తుంటారు..

నా సామిరంగ రెచ్చిపోవుడే.. ఉద్యోగులకు ఐటీ కంపెనీ బంపర్ ఆఫర్.. ఇకపై ఆ లీవ్‌లు కూడా..
IT Company
Shaik Madar Saheb
|

Updated on: Feb 12, 2025 | 7:41 PM

Share

అసలే ఐటీ కంపెనీ.. పని ఒత్తిడి ఫుల్.. ఎంటర్టైన్‌మెంట్ నిల్.. ఇలాంటి పరిస్థితుల్లో వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఉద్యోగులు రిలాక్స్ అయ్యేందుకు ఎంజాయ్.. పండగో అనాల్సిందే.. మంచిగా రెండు రోజుల పాటు చిల్ అవుతుంటారు.. మరుసటి రోజు నుంచి మళ్లీ యథామామూలే.. ఎప్పటి లాగే డ్యూటీ చేయాల్సిందే.. మళ్లీ వీకెండ్ కోసం ఎదురుచూస్తుంటారు.. అలాంటి సమయంలో కొందరు బాగా ఒత్తిడి గురై.. పని భారం తట్టుకోలేక జాబ్ లు సైతం మానేస్తుంటారు.. ప్రతిభ ఉన్నా కానీ.. మాకొద్దు ఈ జాబులంటూ బయటకు వచ్చేస్తుంటారు.. అలాంటి వారి కోసం ఒక జపనీస్ కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ ఉచితంగా ఆల్కహాల్ అందించడంతోపాటు.. ఒకవేళ హ్యాంగోవర్ తో బాధపడుతుంటే.. హ్యాంగోవర్ లీవ్ కూడా ఇస్తామంటూ ప్రకటించింది.. ముఖ్యంగా కొత్త ప్రతిభను ఆకర్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు బడా ఐటీ కంపెనీ ప్రకటించడం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. ప్రతిభ కలిగిన యువతను ఉద్యోగులుగా చేర్చుకునేందుకు జపాన్‌కు చెందిన ట్రస్ట్ రింగ్‌ కంపెనీ ఈ సరికొత్త పథకాన్ని అమలుచేయనున్నట్లు ప్రకటించింది. ఉచితంగా ఆల్కహాల్, హ్యాంగోవర్ లీవ్ లను ఉద్యోగులకు అందించనున్నట్లు తెలిపింది. ఒసాకాలోని ఒక చిన్న టెక్ కంపెనీ ట్రస్ట్ రింగ్ ఈ విధానాన్ని అవలంబిస్తోంది..

వాస్తవానికి సంస్థను మరింత అభివృద్ధి చేసేందుకు, ప్రతిభ కలిగిన యువతను ఆకర్షించడానికి ప్రైవేటు సంస్థలు కొత్త కొత్త విధానాలను అనుసరిస్తుంటాయి. తమ ఉద్యోగులకు ఎక్కువ ప్యాకేజీ ఇవ్వడం, విలాసవంతమైన భవనాలు, పలు రకాల లీవ్‌లు, పార్టీలు, భోజన వసతి.. వర్క్ లో కాసేపు కునుకు తీసేందుకు స్లీపింగ్‌ అవర్స్‌ తదితర ఏర్పాట్లు చేస్తుంటాయి.. ఈ క్రమంలోనే.. జపాన్‌ రగ చెందిన ట్రస్ట్ రింగ్‌ ఈ రొటీన్‌కు భిన్నంగా ఆలోచించి.. కొత్త పథకాన్ని అమలుచేస్తోంది. తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉచితంగా తాగినంత ఆల్కహాల్‌ను అందిస్తోంది. అంతేకాకుండా హ్యాంగోవర్‌ లీవ్‌ కూడా ఇస్తున్నట్లు తెలిపింది.. ఉద్యోగుల్లో ఎవరైనా అధికంగా మద్యం తాగితే ఈ లీవ్‌ను ఉపయోగించుకొని మత్తు దిగాక తిరిగి విధుల్లో చేరవచ్చని తెలిపింది..

అయితే.. ఈ హ్యాంగోవర్‌ లీవ్‌ తమకు బాగా ఉపయోపగడుతోందని కంపెనీ ఉద్యోగులు తెగ సంబరపడుతున్నారు. దీనిని వినియోగించుకొని రెండు లేదా మూడు గంటలు హాయిగా నిద్రపోయి ఆఫీసుకు వస్తున్నామని.. ఇది మరిన్ని గంటలు పనిచేయడానికి ఉపయోగపడుతుందని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

అయితే దీనిపై కంపెనీ స్పందిస్తూ.. ఉద్యోగంలో చేరిన ప్రారంభంలోనే ఉద్యోగులకు ఎక్కువ వేతనం ఇచ్చుకోలేక ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని.. ఇది ఉద్యోగులకు మరింత ఉత్సాహాన్నిస్తుందని కంపెనీ యాజమాన్యం వెల్లడించింది.

‘‘మా కంపెనీలో ప్రారంభ జీతం 222,000 యెన్లు (సుమారు రూ. 1.27 లక్షలు).. ఇందులో ఇప్పటికే 20 గంటల ఓవర్ టైం జీతం కూడా ఉంది.. ఇది కనీస వేతనానికి దగ్గరగా ఉంది.. మేము ప్రారంభ జీతం పెంచలేము, కాబట్టి చిన్న, మధ్య తరహా సంస్థలు ఇలాంటి ఆలోచనలతో ప్రతిభను ఆకర్షించడంపై దృష్టి పెట్టాలని నేను భావిస్తున్నాను” అని కంపెనీ ప్రతినిధి తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..