AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్రాన్స్ అధ్యక్షుడికి మోదీ అపురూప కానుకలు.. ఏం బహూకరించారంటే?

ఫ్రాన్స్ నుంచి బయలుదేరే ముందు ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ఆయన సతీమణి బ్రిజిట్టెలకు ప్రధాని మోదీ భారతీయ ఘన సంస్కృతి ఉట్టిపడే అపురూప కానుకలు అందించారు. అంతేకాదు..అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ పిల్లలకు కూడా అనేక బహుమతులు ఇచ్చారు ప్రధాని మోదీ. ఈ బహుమతుల ద్వారా భారతదేశంలోని అనేక రాష్ట్రాలకు గుర్తింపు ముద్రను ఫ్రాన్స్‌లో నిలిపారు ప్రధాని మోదీ.

ఫ్రాన్స్ అధ్యక్షుడికి మోదీ అపురూప కానుకలు.. ఏం బహూకరించారంటే?
Modi Gave These Gifts Presi
Jyothi Gadda
|

Updated on: Feb 13, 2025 | 10:23 AM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు. మోదీ ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని అమెరికాకు బయలుదేరాడు. ఆయనకు వీడ్కోలు పలికేందుకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చారు. ఆయన ప్రధాని మోదీని కౌగిలించుకుని వీడ్కోలు పలికారు. ఫ్రాన్స్ నుంచి బయలుదేరే ముందు ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ఆయన సతీమణి బ్రిజిట్టెలకు ప్రధాని మోదీ భారతీయ ఘన సంస్కృతి ఉట్టిపడే అపురూప కానుకలు అందించారు. అంతేకాదు..అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ పిల్లలకు కూడా అనేక బహుమతులు ఇచ్చారు ప్రధాని మోదీ. ఈ బహుమతుల ద్వారా భారతదేశంలోని అనేక రాష్ట్రాలకు గుర్తింపు ముద్రను ఫ్రాన్స్‌లో నిలిపారు ప్రధాని మోదీ.

Dokra Art

ఇవి కూడా చదవండి

ఛత్తీస్‌గఢ్‌లో ప్రసిద్ధిగాంచిన డోక్రా కళానైపుణ్యంతో రూపొందించిన లోహపు వాద్యకారుల బొమ్మలను ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ఆయన సతీమణి బ్రిజిట్టెలకు బహూకరించారు ప్రధాని మోదీ. ఆ అపురూపమైన బహుమతులు సంగీతం సాంస్కృతిక ప్రాధాన్యాన్ని చాటిచెప్పేలా ఉన్నాయి. రాజస్థాన్‌ హస్తకళా వైభవాన్ని కళ్లకు కట్టే టేబుల్‌ మిర్రర్‌ను బ్రిజిట్టెకు మోదీ అందజేశారు. దానిపై చెక్కి ఉన్న పుష్పాలు, నెమలి చిత్రాలు కట్టిపడేస్తున్నాయి. ప్రధాని మోదీ పర్యటన తొలి రోజున అధ్యక్షుడు మాక్రాన్ ఇచ్చిన విందులో ఇద్దరు నాయకులు చర్చలు జరిపారు. ఈ స్నేహపూర్వక వాతావరణం మరుసటి రోజు ‘AI యాక్షన్ సమ్మిట్’లో కొనసాగింది. భారతదేశం, ఫ్రాన్స్ సంయుక్తంగా ఈ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చాయి.

ఫ్రాన్స్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్‌తో భేటీ అయిన మోదీ.. వాన్స్‌ ఇద్దరు కుమారులు, ఓ కుమార్తెకు కూడా బహుమతులిచ్చారు. చెక్కతో చేసిన రైల్వే బొమ్మ, భారతీయ జానపద చిత్రాలతో కూడిన జిగ్సా పజిల్, చెక్కతో చేసిన అక్షరమాల వాటిలో ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..