Fire accident in Japan: జపాన్‌లో భారీ అగ్నిప్రమాదం.. 28 మంది మృతి..
జపాన్‌లోని ఒసాకా నగరంలోని ఓ భవనంలో మంటలు చెలరేగడంతో 27 మంది మరణించారు. జపనీస్ బ్రాడ్‌కాస్టర్ నిప్పన్ హోసో క్యోకై (NHK) మార్కెట్‌లోని ఎనిమిది అంతస్తుల భవనంలోని నాలుగో లేదా ఐదవ అంతస్తులో శుక్రవారం మంటలు చెలరేగాయని వెల్లడించింది.

Fire accident in Japan: జపాన్‌లోని ఒసాకా నగరంలోని ఓ భవనంలో మంటలు చెలరేగడంతో 27 మంది మరణించారు. జపనీస్ బ్రాడ్‌కాస్టర్ నిప్పన్ హోసో క్యోకై (NHK) మార్కెట్‌లోని ఎనిమిది అంతస్తుల భవనంలోని నాలుగో లేదా ఐదవ అంతస్తులో శుక్రవారం మంటలు చెలరేగాయని వెల్లడించింది. ఈ ఘటనలో 28 మంది చిక్కుకున్నారనీ, వారిలో 27 మంది గుండె ఆగిపోవడంతో మరణించారనీ తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అరగంటలో భవనంలో మంటలు అదుపులోకి వచ్చాయి. మంటల కారణంగా కాలిపోయిన కిటికీలను పై ఫోటోలో చూడవచ్చు.
జపాన్‌లోని వాణిజ్య జిల్లాగా భావించే ఒసాకా నగరంలో మంటలు చెలరేగినట్లు స్థానిక అగ్నిమాపక శాఖ తెలిపింది. మంటల కారణంగా భవనంలో ఉన్న 27 మంది చనిపోయి ఉంటారని డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఈ మంటలు భవనం లోపల అత్యంత వేగంతో వ్యాపించాయి. మంటలు చెలరేగిన భవనం ఎనిమిది అంతస్తులు. టీవీలో ప్రసారమైన సంఘటన చిత్రాలు డజన్ల కొద్దీ అగ్నిమాపక సిబ్బంది భవనం లోపల, వెలుపల మంటలను ఆర్పివేస్తున్నట్లు చూపించాయి. భవనంలోని నాల్గవ అంతస్తులో విరిగిన.. నల్లబడిన కిటికీల నుండి లోపల కార్యాలయం కనిపిస్తుంది. ఈ కార్యాలయం చాలా ఇరుకైనది.
నాలుగో అంతస్తులో క్లినిక్ ఉండేది
మీడియా నివేదికల ప్రకారం, భవనం ఈ అంతస్తులో ఒక క్లినిక్ ఉంది. ఇది ప్రజలకు మానసిక ఆరోగ్య సేవ..సాధారణ వైద్య సౌకర్యాలను అందిస్తుంది. ఒసాకా అగ్నిమాపక విభాగానికి చెందిన అధికారి AFP వార్తా సంస్థతో మాట్లాడుతూ, మంటల్లో 28 మందిచ చిక్కుకున్నారానీ వారిలో 27 మంది మరణించారనీ.. మిగిలిన ఒక్కరూ బతికే సంకేతాలు లేవని చెప్పారు. బాధితులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.18 గంటలకు భవనంలోని నాల్గవ అంతస్తులో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం సమయానికి 70 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి.
మంటలు అదుపులో ఉన్నట్లు గుర్తించారు
పశ్చిమ జపాన్‌లోని ఒసాకా నగరంలోని కిటాషించి రైల్వే స్టేషన్ సమీపంలో రద్దీగా ఉండే వ్యాపార ప్రాంతంలో చెలరేగిన మంటలు అరగంట తర్వాత అదుపులోకి వచ్చినట్లు అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. మంటలు వ్యాపించడాన్ని చూస్తున్న ఓ మధ్యవయస్కుడైన మహిళ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ఎన్‌హెచ్‌కెతో విపరీతంగా పొగలు కమ్ముకున్నాయని చెప్పారు. ఘాటైన వాసన కూడా వచ్చింది. కార్యాలయం, దవాఖానలో ఉన్న ఫర్నీచర్, ఇతర సామగ్రి కాలిపోవడంతో ఇలాంటి దుర్వాసన వస్తోందని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: Dating Apps: వేగంగా విస్తరిస్తోన్న డేటింగ్ సంస్కృతి.. టాప్‌లో హైదరాబాద్.. సర్వేలో తేలిన ఆసక్తికర విషయాలు..