Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIFT Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో ఉద్యోగాలు.. రూ. 50 వేలకు పైగా జీతం పొందే అవకాశం..

NIFT Recruitment 2021: నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఫ్యాషన్‌ టెక్నాలజీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న క్యాంపస్‌లో ఉన్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను..

NIFT Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో ఉద్యోగాలు.. రూ. 50 వేలకు పైగా జీతం పొందే అవకాశం..
Nift Jobs
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Dec 17, 2021 | 6:59 AM

NIFT Recruitment 2021: నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఫ్యాషన్‌ టెక్నాలజీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న క్యాంపస్‌లో ఉన్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా 190 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తుచేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. దీంతో పాటు టీచింగ్‌/పరిశోధన అనుభవం ఉండాలి.

* అభ్యర్థుల వయసు 31.01.2022 నాటికి 40ఏళ్లు మించకుండా ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

* ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత హార్డ్‌కాపీని రిజిస్ట్రార్‌ కార్యాలయం, హెడ్‌ ఆఫీస్, నిఫ్ట్‌ క్యాంపస్, హజ్‌ఖాస్, న్యూఢిల్లీ–110016 అడ్రస్‌కు పంపించాలి.

* అభ్యర్థులను రాత పరీక్ష, ప్రజంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

* మొదట రాత పరీక్షను 100 మార్కులకు నిర్వహిస్తారు. రాతపరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రజంటేషన్‌/క్లాస్‌ రూం లెక్చర్‌కు ఎంపికచేస్తారు. ఇందులోనూ విజయం సాధిస్తే.. ఇంటర్వ్యూకు పిలుస్తారు. మూడింట్లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56,100+కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు అందిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది 31-01-2022 కాగా హార్డ్‌ కాపీలను పంపడానికి 15-02-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Mosquito Coil: ఇంట్లో దోమల కాయిల్స్ వెలిగిస్తున్నారా..? అయితే మీకు షాకింగ్ న్యూస్..

Telangana: రేపు కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ సంయుక్త సమావేశం.. చర్చకు రానున్న అంశాలివేనా?

బిగ్ బాస్ సీజన్ 5 కు గెస్టులుగా బాలీవుడ్ కపుల్