Mosquito Coil: ఇంట్లో దోమల కాయిల్స్ వెలిగిస్తున్నారా..? అయితే మీకు షాకింగ్ న్యూస్..

Mosquito Coil effect on health: మనమంతా ఆరోగ్యంగా ఉండటానికి స్వచ్ఛమైన గాలి ఇంట్లోకి ప్రవేశించడం చాలా అవసరం. స్వచ్ఛమైన గాలి కోసమే అందరూ ఇంట్లో కొన్ని గంటల పాటు తలుపులు, కిటికీలన్నింటినీ

Mosquito Coil: ఇంట్లో దోమల కాయిల్స్ వెలిగిస్తున్నారా..? అయితే మీకు షాకింగ్ న్యూస్..
Mosquito Coil
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 16, 2021 | 9:30 PM

Mosquito Coil effect on health: మనమంతా ఆరోగ్యంగా ఉండటానికి స్వచ్ఛమైన గాలి ఇంట్లోకి ప్రవేశించడం చాలా అవసరం. స్వచ్ఛమైన గాలి కోసమే అందరూ ఇంట్లో కొన్ని గంటల పాటు తలుపులు, కిటికీలన్నింటినీ తెరుస్తుంటారు. దీంతో గాలితో పాటు దోమలు, పలు కీటకాలు కూడా ఇంట్లోకి వస్తుంటాయి. అయితే.. దోమలతో ఇంకొంచెం ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే.. దోమలు కుట్టడం వల్ల మలేరియా, వైరల్ జ్వారాలు వస్తుంటాయి. అందుకే అంతా దోమలకు ఎక్కువగా భయపడుతుంటారు. వాస్తవానికి దోమల వల్ల ప్రమాదం కూడా ఎక్కువే. అందుకే ఇంట్లో ఉన్న దోమలను నియంత్రించేందుకు చాలా మంది పలు చిట్కాలను పాటిస్తుంటారు. రాత్రి పడుకునేటప్పుడు చాలామంది మస్కిటో కాయిల్స్ కాలుస్తుంటారు. ఇలా చేయడం వల్ల దోమలు నుంచి ఎంత రక్షణ కలుగుతుందో తెలీదు కానీ.. మీ కుటుంబం మాత్రం ప్రమాదంలో పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ముమ్మాటికి నిజం.. దోమలను తరిమికొట్టే లేదా చంపే ఈ మస్కిటో కాయిల్స్ శరీరానికి చాలా హానికరం కలిగిస్తుంటాయి. ఎందుకంటే ఇందులోనుంచి హానికరమైన రసాయనాలు విడుదలవుతాయి.. ఇది శరీరానికి అస్సలు మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మస్కిటో కాయిల్స్ ఎంత ప్రమాదకరమో ఇప్పుడు తెలుసుకోండి.. నిపుణుల ప్రకారం.. ఒక్కొక్క మస్కిటో కాయిల్‌ దాదాపు 75 సిగరెట్ల కంటే ఎక్కువ పొగను ఉత్పత్తి చేస్తుంది. ఇది మీకు, మీ కుటుంబానికి ప్రమాదకరం. ఒక నివేదిక ప్రకారం.. దోమలను చంపే ఈ కాయిల్స్ నుంచి వచ్చే పొగ.. శ్వాసనాళంలో తీవ్ర ఉద్రిక్తతను కలిగిస్తుంది.. అంతేకాకుండా శ్వాసకు అడ్డంకిని మారి ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుంది. ఇది శరీరానికి కూడా అస్సలు మంచిది కాదు.

రసాయన పదార్ధాల మిశ్రమం.. మస్కిటో కాయిల్స్‌లో అనేక రకాల రసాయన పదార్థాల మిశ్రమం ఉంటుంది. ఆ మిశ్రమాలలో ఉండే పదార్థాలు మానవ శరీరానికి హానికరం. ఇందులో రెండు రకాల రసాయన పదార్ధాలు కలుస్తాయి. వాటిలో ఒకటి క్రిమిసంహారక మందు దోమలను చంపుతుంది.. మరొకటి సుగంధ పదార్థం (సిట్రోనెల్లా వంటివి) దోమలను తరిమివేస్తుంది. ఒక పరిశోధన ప్రకారం ఒక మస్కిటో కాయిల్ 100 సిగరెట్లు కాల్చినంత ప్రమాదకరం.

మీ ఆరోగ్యానికి ఎలాంటి హాని కలుగుతుందంటే..? 1 – ఆస్తమా దోమలను తరిమికొట్టేందుకు ఉపయోగించే మస్కిటో కాయిల్స్ ఆస్తమా వంటి సమస్యలకు దారితీస్తాయి. మనం కాయిల్ పొగను ఎక్కువసేపు పీల్చుకుంటే.. ఆస్తమా వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ పొగ పిల్లల శ్వాసపై కూడా చెడు ప్రభావాన్ని చూపడంతోపాటు.. అనారోగ్యాన్ని కలిగిస్తుంది.

2- కళ్ళు, చర్మంపై ప్రభావం మస్కిటో కాయిల్ నుంచి వెలువడే పొగ మీ కళ్లను, చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కళ్ల మంట పెరుగడంతోపాటు.. సమస్యలు వస్తాయి.

3 – శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. కాయిల్‌లో ఉపయోగించే రసాయనాలు.. బగ్ స్ప్రేలో కూడా ఉపయోగిస్తారు. అటువంటి పరిస్థితిలో మీరు ఈ పొగను ఎక్కువసేపు పీల్చుకుంటే.. శ్వాస సమస్యతోపాటు.. ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటాయి.

ఏం చేయాలంటే..? కాయిల్ కాల్చడం తప్పనిసరి అయితే.. దోమలు బయటకు వెళ్లేంత వరకు డోర్లు తీసి ఉంచాలి. లేకపోతే.. అసలు దోమలు లోపలికి రాకుండా ఇంటిలో మెష్‌ డోర్‌లను ఏర్పాటు చేసుకోవాలి. పిల్లలు, మీ కోసం పూర్తి స్లీవ్ దుస్తులను ధరిస్తే.. దోమల నుంచి రక్షణ పొందవచ్చు. దోమతెరను ఉపయోగించడం చాలా మంచిది.

Also Read:

Shocking News: భర్త నచ్చలేదని అర్ధరాత్రి దురాగతం.. సలసల మరిగే నూనెతో భార్య ఏం చేసిందంటే..?

Crime News: అనుమానమే పెనుభూతమై ప్రాణాలు తీసింది.. అర్ధరాత్రి ఆ ఇంట్లో అసలేం జరిగింది..?