Pomelo Fruit: ఈ సీజనల్ ఫ్రూట్ మహిళకు ఎంత మేలు చేస్తుందో తెలిసా..? కాన్సర్ నిరోధకాలు కలిగిన పండు ఇదే..(వీడియో)
సీజనల్ ఫ్రూట్స్ వల్ల మనిషికి ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది. ఆయా సీజనల్ లో లభ్యమయ్యే పండ్లను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. వింటర్‌లో విరివిగా దొరికే పంపర పనస పండులో కూడా మంచి ఔషధ గుణాలున్నాయి.
సీజనల్ ఫ్రూట్స్ వల్ల మనిషికి ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది. ఆయా సీజనల్ లో లభ్యమయ్యే పండ్లను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. వింటర్‌లో విరివిగా దొరికే పంపర పనస పండులో కూడా మంచి ఔషధ గుణాలున్నాయి. నిమ్మజాతి చెందిన ఈ పంపర పనసలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తులకు ఇది దివ్య ఔషధమని సంప్రదాయ వైద్యులు చెబుతున్నారు. చైనా ప్లోరిడా, వంటి మధ్యస్థ పంపర పనస ఉష్ణమండల ప్రాంతాల్లో విరివిగా పండుతుంది. పులుపు, వగరు, తీపి రుచుల కలయికతో ఉండే ఈ పండు తొనలు ఎరుపు, తెలుపు రంగులో ఉంటాయి. ఈ పంపర పండు ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలుసుకుందాం.. పంపర పనసలో ఔషదాలు మెండు. జీర్ణ వ్యవస్థను శుద్ధి చేయటానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. ఈ పండులో క్యాన్సర్ నిరోధకాలు కూడా ఉన్నాయి. బోలు ఎముకల వ్యాధి నుంచి రక్షణ ఇస్తుంది. ముఖ్యంగా మహిళలకు అత్యంత మేలు చేస్తోంది. బరువు తగ్గించడంలోనూ, లివర్ సమస్యలు నివారించడంలోనూ ఎంతో బాగా పనిచేస్తుంది. ఈ పండు తినడం ద్వారా రక్త ప్రసరణ మెరుగవుతుంది. గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది. అంతేకాదు ఈ పండు చర్మాన్ని ఆరోగ్య వంతంగా ఉంచుతుంది. వృద్ధాప్యపు లక్షణాలను దూరం చేస్తుంది. పులుపు-వగరు తీపిల కలయికను ఇష్టపడేవారు ఈ సీజన్ లో దొరికే పంపర పనస పండుని నిర్లక్ష్యం చేయకుండా తినండి.. ముఖ్యంగా 30 దాటిన స్త్రీలకు ఎముకలకు ఎంతో శక్తినిస్తుంది.
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

