Telangana: రేపు కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ సంయుక్త సమావేశం.. చర్చకు రానున్న అంశాలివేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ రేపు (డిసెంబర్‌ 17) సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భ‌వ‌న్‌లో ఈ సమావేశం ప్రారంభం కానుంది.

Telangana: రేపు కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ సంయుక్త సమావేశం.. చర్చకు రానున్న అంశాలివేనా?
Follow us
Basha Shek

|

Updated on: Dec 16, 2021 | 8:03 PM

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ రేపు (డిసెంబర్‌ 17) సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భ‌వ‌న్‌లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా ప‌రిష‌త్ చైర్మన్లు, డీసీఎంఎస్ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్లు, రైతుబంధు జిల్లా క‌మిటీల అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి కార్పొరేష‌న్ చైర్మన్లు, టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ స‌భ్యులు ఈ సమావేశానికి హాజ‌రు కానున్నారు. కాగా ఈ సమావేశంలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లేలా ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నట్లు సమాచారం. మరోవైపు ప్రత్యర్ధి పార్టీలపై.. మరీ ముఖ్యంగా బీజేపీ విషయంలో మరింత దూకుడు పెంచాలని అధినేత ఆదేశించనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లే విషయంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అలాంటిదేమీ ఉండకపోవచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు.

కాగా రాజకీయంగా పార్టీ శ్రేణులు మరింత చురుగ్గా ఉండాలని కావాలనీ.. టీఆర్ఎస్ అధినేత ఆదేశించే అవకాశాలు లేక పోలేదని అంచనా వేస్తున్నారు. ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ ను కలవడం.. ఆ సమావేశంలో చర్చించిన అంశాల ప్రస్తావన చేయనున్నారని మరో సమాచారం. రాష్ట్రంలో వరి ధాన్యం వ్యవహారాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లమని చెబుతారనీ.. ఈ విషయంలో రైతాంగానికి సర్ది చెప్పమంటారని కూడా అనుకుంటున్నారు పార్టీ వర్గాలు. ఇక కీలకమైన దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ తో పాటు మరో నాలుగు మండలాల్లో అమలు చేస్తామని.. ఈ విషయాన్ని దళిత వర్గాల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లమంటూ కేసీఆర్ ఆదేశించనున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.

Also Read:

Hyderabad: గ్యాస్‌ సిలిండర్లను అపహరించుకెళ్లిన దొంగలు.. CCTV కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు..

Education: ఆ కళాశాలలపై కఠిన చర్యలు.. అదనపు ఫీజుల దోపిడీపై ఇంటర్‌ బోర్డు ఆగ్రహం..

T Congress: ఎమ్మెల్సీ ఫలితాలపై టీపీసీసీలో అంతర్మథనం.. మరిన్ని స్థానాల్లో పోటీ చేసి ఉంటే బాగుండేదంటున్న నేతలు..