Hyderabad: గ్యాస్ సిలిండర్లను అపహరించుకెళ్లిన దొంగలు.. CCTV కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు..
పోలీసులు ఎన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నా, హెచ్చరికలు జారీ చేస్తోన్నా దొంగలు ఆగడం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా తమ చేతివాటం చూపిస్తూనే ఉన్నారు.
పోలీసులు ఎన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నా, హెచ్చరికలు జారీ చేస్తోన్నా దొంగలు ఆగడం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా తమ చేతివాటం చూపిస్తూనే ఉన్నారు. చేతికందినవి దోచుకునిపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఇద్దరు దొంగలు ఏకంగా గ్యాస్ సిలిండర్లను అపహరించారు. ఓ అపార్ట్ మెంట్లో ఉంచిన మూడు సిలిండర్లను చాకచక్యంగా పట్టుకెళ్లారు. అయితే ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డవ్వడంతో ఈ దొంగల భాగోతం బయటపడింది. హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఖాన్‌మెట్ ఆలేఖ్య బ్లూ బెల్స్అపార్ట్‌మెంట్‌లో ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు అక్కడే ఉన్న సిలిండర్లను తమతో తీసుకెళ్లారు. మొత్తం మూడు సిలిండర్లు చోరీకి గురయ్యాయి. అయితే ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దొంగల ఆచూకీ కనుగొనే పనిలో పడ్డారు పోలీసులు. కాగా ఇటీవల భాగ్యనగరంలో దొంగతనాలు పెరుగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
Also Read:
Shilpa Chowdary Case: చీటింగ్ కేసులో శిల్పా చౌదరికి బెయిల్ మంజూరు.. ఇంతలో మరో ట్విస్ట్..
TS Inter 1st Year Result 2021: ఇంటర్ ఫస్టియర్ పరీక్షా ఫలితాలు విడుదల.. ఫలితాలను ఇలా చూసుకోండి..