- Telugu News Photo Gallery Technology photos China company Tecno launches Spark 8T smart phone have a look on features and price details
Tecno Spark 8T: ఇండియన్ మార్కెట్లోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. రూ. 9వేల లోపే అదిరిపోయే టెక్నో స్పార్క్ 8టీ..
Tecno Spark 8T: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ టెక్నో తాజాగా భారత మార్కెట్లోకి టెక్నో స్పార్క్ 8టీ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్‌లో ఆకట్టుకునే ఫీచర్లతో ఉన్న ఈ ఫోన్ విశేషాలు మీకోసం..
Narender Vaitla | Edited By: Ravi Kiran
Updated on: Dec 17, 2021 | 6:59 AM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ టెక్నో తాజాగా భారత మార్కెట్లోకి టెక్నో స్పార్క్ 8టీ పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. రూ. 8,999కే అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ సూపర్ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది.

4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్‌లో విడుదల చేసిన ఈ ఫోన్‌ను మెమొరీ కార్డుతో స్టోరేజ్ పెంచుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్ అమేజాన్‌లో అందుబాటులో ఉంది.

మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు.

ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగా పిక్సెల్స్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం ప్రత్యేకంగా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఈ ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు పవర్ సేవింగ్ మోడ్ ఫీచర్‌ను అందించారు. 4జీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్‌బీ, ఎఫ్ఎం రేడియో, యూఎస్‌బీ ఓటీజీ లాంటి ఫీచర్స్ ఈ ఫోన్ ప్రత్యేకం.





























