Maldives Fire: మాల్దీవుల్లో భారీ అగ్ని ప్రమాదం.. మృతులలో 9 మంది భారతీయులు

|

Nov 10, 2022 | 3:20 PM

పర్యాటకులను అమితంగా ఆకర్షించే మాల్దీవులలో భారీ అగ్ని ప్రమాదం.. ఈ ఘటనలో 11 మంది మరణించారు. మృతి చెందినవారిలో 9 మంది భారతీయులే.

Maldives Fire: మాల్దీవుల్లో భారీ అగ్ని ప్రమాదం.. మృతులలో 9 మంది భారతీయులు
Maldives
Follow us on

పర్యాటకులను అమితంగా ఆకర్షించే మాల్దీవులలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ దేశ రాజధానిలోని ఓ బిల్డింగ్‌లో జరిగిన ఈ ఘటనలో 11 మంది మరణించారు. మృతి చెందినవారిలో 9 మంది భారతీయులే ఉన్నట్లు సమాచారం.  చనిపోయినవారి శరీరాలను బిల్డింగ్ నుంచి బయటకు తీసుకువచ్చినట్లు అక్కడి అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం  మాల్దీవుల రాజధాని మేల్‌లోని ఓ భవనంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఇతర దేశాల నుంచి వచ్చిన వలస కూలీలు ఆ భవనంలో ఉంటున్నారు.

ఉన్నట్లుండి జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం పదకొండు మంది చనిపోయినట్లు.. వారిలో తొమ్మిది మంది భారత్‌కు చెందినవారే అని.. వారందరి మృత దేహాలను మంటల నుంచి బయటకు తెచ్చామని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకొన్న అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో అనేక మంది గాయాలపాలయ్యారని, వారందరిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించామని వారు అన్నారు. మంటలను అదుపు చేయడానికి దాదాపు నాలుగు గంటల సమయం పట్టిందని చెప్పారు.

మృతులలో 9 మంది  భారతీయులే!

ఇవి కూడా చదవండి

జీవనోపాధి కోసం వచ్చి అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో తొమ్మిది మంది భారతీయులే అని ముందుగా ఘటనాస్థలంలోని ఓ సెక్యూరిటీ ఆఫీసర్ తెలిపారు. విషయాన్ని తెలుసుకున్న భారత హైకమిషన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో పాటు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..