World’s Happiest Country: ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా మళ్లీ అదే దేశం.. భారత్‌ ర్యాంక్‌ ఇదే..

|

Mar 21, 2023 | 7:06 PM

ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్‌లాండ్‌ వరుసగా ఆరోసారి ఎంపికై రికార్డు నెలకొల్పింది. 150కిపైగా దేశాల్లో చేపట్టిన సర్వే ఆధారంగా ర్యాంకింగ్‌ లిస్టును రూపొందించారు. మార్చి 20న ప్రపంచ సంతోష దినోత్సవం సందర్భంగా..

Worlds Happiest Country: ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా మళ్లీ అదే దేశం.. భారత్‌ ర్యాంక్‌ ఇదే..
World's Happiest Country
Follow us on

ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్‌లాండ్‌ వరుసగా ఆరోసారి ఎంపికై రికార్డు నెలకొల్పింది. 150కిపైగా దేశాల్లో చేపట్టిన సర్వే ఆధారంగా ర్యాంకింగ్‌ లిస్టును రూపొందించారు. మార్చి 20న ప్రపంచ సంతోష దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి సోమవారం వార్షిక యూఎన్‌ స్పాన్సర్డ్‌ ఇండెక్స్‌ 2022ను విడుదల చేసింది. ఈ సూచిలో దాయాది దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్‌, చైనాలకంటే భారత్‌ దిగువన 126వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ 108వ ర్యాంక్‌లో ఉండగా, శ్రీలంక 112వ ర్యాంక్‌లో ఉంది. గతేడాది కంటే మన దేశం ర్యాంక్‌ మెరుగుపడిందని చెప్పవచ్చు. 2021 వరల్డ్‌ హ్యాపీనెస్‌ రిపోర్టులో భారత్‌ 136వ ర్యాంక్‌లో ఉండగా ఈ ఏడాది 10 పాయింట్లు కోల్పోయి 126వ ర్యాంకుకు చేరుకుంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ నేపథ్యంలో ఆ దేశాల ర్యాంకులు పతనమయ్యాయి. రష్యా 72వ స్థానంలో ఉండగా, ఉక్రెయిన్‌ 92వ స్థానంలో ఉంది.

ఉత్తర ఐరోపా దేశమైన డెన్మార్క్‌ రెండవ స్థానంలో ఉంది. గత ఏడాది కంటే ఐదు స్థానాలు ఎగబాకి ఇజ్రాయెల్ నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. వేలాది నదులు, దేశమంతా పచ్చని అడవులు, 5.5 మిలియన్ల జనాభా కలిగిన ఫిన్లాండ్ అత్యంత సంతోహకరమైన దేశంగా ఎంపిక కావడం వేనుక ఆ దేశ విస్తృతమైన సంక్షేమ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని నివేదికలో వెల్లడించింది. నమ్మకమైన పాలనా యంత్రాంగం, దేశ జనాభాలో తక్కువ స్థాయిలో అసమానతలున్నట్లు తెల్పింది. ఒక దేశ హ్యాపీనెస్‌ను సామాజిక మద్దతు, ఆదాయం, ఆరోగ్యం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి అనే ఆరు కీలక అంశాలను నివేదిక పరిగణనలోకి తీసుకుంటుంది. మూడేళ్ల వ్యవధిలో సగటు డేటా ఆధారంగా హ్యాపీనెస్ స్కోర్‌ను ఆయా దేశాలకు కేటాయిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.