Donald Trump: నేను దోషిని కాదు.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్.. విడుదల.. కారణం ఏంటో తెలుసా..
Donald Trump Secret Document Case: అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత అధికారిక రహస్యాలున్న పత్రాలను వెంట తీసుకెళ్లాడని అభియోగాలను ఎదుర్కొన్నారు. తన ఇంట్లో ఆ పత్రాలను దాచిపెట్టుకున్నారనే ఆరోపణలపై ట్రంప్ పై కేసు నమోదైంది. లాంఛనంగా అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ట్రంప్‌ను హాజరుపరిచారు.

US Secret Document Case: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం మరోసారి మియామిలోని ఫెడరల్ కోర్టు ముందు హాజరయ్యారు. అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత అధికారిక రహస్యాలున్న పత్రాలను వెంట తీసుకెళ్లాడని అభియోగాలను ఎదుర్కొన్నారు. తన ఇంట్లో ఆ పత్రాలను దాచిపెట్టుకున్నారనే ఆరోపణలపై ట్రంప్ పై కేసు నమోదైంది. లాంఛనంగా అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ట్రంప్‌ను హాజరుపరిచారు. దీంతో అమెరికా చరిత్రలోనే నేరారోపణలు ఎదుర్కొంటూ కోర్టుకు హాజరైన తొలి మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచిపోయారు.
ఫ్లోరిడాలోని తన ఎస్టేట్‌లో ట్రంప్ నిబంధనలకు విరుద్ధంగా అధికారిక రహస్య పత్రాలను దాచారని అభియోగాలను ట్రంప్ తిరస్కరించారు. ఈ కేసులో ట్రంప్ అరెస్టుకు ఆదేశాలు వెలువడతాయనే ప్రచారం జరిగింది. అయితే ఎలాంటి షరతులు లేకుండానే ఆయన కోర్టు నుంచి బయటకు వెళ్లిపోయారు. ట్రంప్ కోర్టు నుంచి బయటకు వచ్చిన తరువాత ఒక క్యూబన్ రెస్టారెంట్లో తన మద్దతుదారులతో కలిసి సరదాగా గడిపారు ట్రంప్.
సీక్రెట్ పత్రాలను తీసుకువెళ్లినట్లు ఆరోపణలు
జనవరి 2021లో ట్రంప్ వైట్‌హౌస్‌ను విడిచిపెట్టినప్పుడు.. పెంటగాన్, CIA, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, ఇతర ఇంటెలిజెన్స్ బాడీల నుంచి అత్యంత సున్నితమైన సమాచారాన్ని కలిగి ఉన్న రహస్య ఫైళ్లను తన వెంట తీసుకెళ్లాడని న్యాయ శాఖ పేర్కొంది. స్కై న్యూస్ ప్రకారం, ట్రంప్ ఇంటెలిజెన్స్ సమాచారంతో కూడిన పత్రాలను షవర్, బాల్రూమ్‌లో ఉంచారు.
పత్రాల బాక్సులను తన మార్-ఎ-లాగో ఎస్టేట్‌కు తరలించడంలో ట్రంప్ స్వయంగా పాల్గొన్నారని ఆరోపణలు వచ్చాయి. అంతర్జాతీయ మీడియా సంస్థలు అందించిన సమాచారం ప్రకారం, ట్రంప్ నివాసం నుండి FBI స్వాధీనం చేసుకున్న అత్యంత రహస్య రికార్డులలో విదేశీ దేశం అణు సామర్థ్యాల వివరాలు ఉన్నాయి.
ప్రమాదంలో అమెరికా జాతీయ భద్రత
జూన్ 10న ఫ్లోరిడాలోని ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన నేరారోపణ ప్రకారం, ట్రంప్ తన మార్-ఎ-లాగో నివాసం, క్లబ్‌లో పత్రాలను సురక్షితంగా ఉంచలేదు. ఇది క్రమం తప్పకుండా వేలాది మంది అతిథులను ఈవెంట్‌లకు ఆతిథ్యం ఇస్తుంది. పత్రాలను అనధికారికంగా బహిర్గతం చేయడం వల్ల అమెరికా జాతీయ భద్రత ప్రమాదంలో పడుతుందని ఆరోపణలు పేర్కొన్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం