Ukraine: ఉక్రెయిన్‌కు గుడ్ న్యూస్ చెప్పిన ఈయూ.. హర్షం వ్యక్తం చేసిన జెలెన్‌స్కీ..

|

Jun 18, 2022 | 5:32 AM

Ukraine EU Status: యూరోపియన్‌లో చేరేందుకు ఉక్రెయిన్‌కు క్లియరెన్స్‌ వచ్చేసింది. ఇందుకు ఈయూ లాంఛనంగా అంగీకరించడంపై హర్షం వ్యక్తం చేశారు

Ukraine: ఉక్రెయిన్‌కు గుడ్ న్యూస్ చెప్పిన ఈయూ.. హర్షం వ్యక్తం చేసిన జెలెన్‌స్కీ..
Eu Ukraine
Follow us on

Ukraine EU Status: యూరోపియన్‌లో చేరేందుకు ఉక్రెయిన్‌కు క్లియరెన్స్‌ వచ్చేసింది. ఇందుకు ఈయూ లాంఛనంగా అంగీకరించడంపై హర్షం వ్యక్తం చేశారు ఆ దేశ ప్రధాని జెలెన్‌స్కీ. అవును, యూరోపియన్‌ యూనియన్‌లోకి ఉక్రెయిన్‌ చేరడానికి తొలిఅడుగు పడింది. ఉక్రెయిన్‌కు అభ్యర్థి హోదాను ఇవ్వడానికి ఈయూ లాంఛనంగా అంగీకరించింది. యూరోపియన్‌ ప్రమాణాలకు తగినట్లు నడుచుకోవడానికి ఉక్రెయిన్‌ ఆకాంక్షలు వ్యక్తం చేసిందనీ EU అధ్యక్షురాలు ఉర్సులా చెప్పారు. ఈనెల 23-24 తేదీల్లో బ్రస్సెల్స్‌లో జరిగే సమావేశంలో 27 EU సభ్యదేశాలు ఈ అంశంపై చర్చించి- ఉక్రెయిన్‌తో పాటు మాల్డోవాకు సభ్యత్వం ఇస్తారని భావిస్తున్నారు.

యూరోపియన్‌ సభ్యత్వం ద్వారా విజయానికి తాము మరింత చేరువ అయ్యామని హర్షం వ్యక్తం చేశారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. అభ్యర్థి హోదాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినందుకు యూరోపియన్‌ కూటమికి జెలెన్‌ స్కీ ధన్యవాదాలు చెప్పారు. యుద్ధంతో నాశనమైన తమ దేశం కోలుకోవడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని జెలెన్‌స్కీ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు రష్యా పౌరులను ఇకపై వీసా ఉంటేనే తమ దేశంలోకి రానిస్తామని​జెలెన్​స్కీ ప్రకటించారు. ఇప్పటి వరకూ ఇరు దేశాల మధ్య వీసా లేకుండానే రాకపోకలు ఉండేవి.

ఇవి కూడా చదవండి

మరోవైపు నాటో సభ్యత్వంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు ఉక్రెయిన్‌ రక్షణమంత్రి ఒలెక్సీ ఒజ్నికోవ్. తమ దేశానికి నాటో సభ్యత్వం కూడా దాదాపు దక్కినట్లేనని అన్నారు. నాటో కూటమి తమను ఇప్పటికే డీఫ్యాక్టో సభ్యదేశంగా పరిగణిస్తోందని చెప్పారాయన. కాగా నాటోలోకి ఉక్రెయిన్‌ను చేర్చడం నేరపూరిత చర్య అని రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లవరోవ్‌ అన్నారు. ఉక్రెయిన్‌ను చేర్చుకుంటే నాటో విపరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు లవరోవ్‌.