Russia – UK: బ్రిటన్‌లో వెయ్యిమందికి పైగా పుతిన్ గూఢచారులు..? అన్ని రంగాల్లో ఉన్నారంటూ రిపోర్ట్..

|

Nov 15, 2022 | 6:10 AM

బ్రిటన్‌లో రష్యా వేగులు పనిచేస్తున్నారా? యూకే నలుమూలలా చుట్టుముట్టి.. పుతిన్‌కు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారా? ఇవే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి బ్రిటన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్. 

Russia - UK: బ్రిటన్‌లో వెయ్యిమందికి పైగా పుతిన్ గూఢచారులు..? అన్ని రంగాల్లో ఉన్నారంటూ రిపోర్ట్..
Vladimir Putin
Follow us on

గతంలో గూఢచారిగా పనిచేసిన పుతిన్.. ఇప్పుడు అదే వ్యవస్థను ఉపయోగించుకుని బ్రిటన్‌ను దెబ్బకొట్టాలనుకుంటున్నాడా? బ్రిటన్‌లో రష్యా వేగులు పనిచేస్తున్నారా? యూకే నలుమూలలా చుట్టుముట్టి.. పుతిన్‌కు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారా? ఇవే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి బ్రిటన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్. ఏకంగా వెయ్యి మందికి పైగా గూఢచారులు బ్రిటన్‌లోని పలు సంస్థల్లో పనిచేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. రష్యాకు చెందిన ఫారెన్‌ ఇంటెలిజెన్స్ సర్వీస్‌ గైడెన్స్‌లో వీళ్లంతా పనిచేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ శుక్రవారం బెర్లిన్‌లోని బ్రిటన్‌ రాయబార కార్యలయ సెక్యూరిటీ గార్డ్‌ ఒకరు మాస్కోకు సమాచారం పంపుతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఇన్ఫార్మర్లు వ్లాదమిర్ పుతిన్ కనుసన్నల్లో పనిచేస్తున్నట్లు అనుమానం బ్రిటన్, జర్మనీ ఏజెన్సీలు వ్యక్తంచేస్తున్నాయి.

మినీక్యాబ్‌ డ్రైవర్ల దగ్గర నుంచి బారిస్టర్ల వరకు అన్ని రంగాల్లో ఈ వేగులు ఉన్నారనేది బ్రిటన్ అనుమానం. ముఖ్యంగా విద్యార్థులు, ట్రేడ్‌ యూనియన్లు, ఉద్యమ సంస్థలు, టీచర్లు, డ్రైవర్లు, రాజకీయ నాయకులు, సివిల్‌ సర్వీస్‌ సిబ్బంది, పోలీసులు.. ఇలా ప్రతి విభాగంలోనూ ఉన్నారు. వీరంతా సాధారణ పౌరుల్లానే జీవిస్తున్నారనేది ఇంగ్లాండ్, జర్మనీ ఇంటెలిజెన్స్ పేర్కొంటోంది.

లండన్‌లోని రష్యా రాయబార కార్యాలయ పరిధిలో పనిచేసే గూఢచారుల కంటే.. అజ్ఞాతంలో ఉండి పనిచేసే ఏజెంట్లే ఎక్కువమంది ఉంటారని ఆ రిపోర్ట్ సారాంశం. వీళ్లేకాకుండా యూకేలో 73 వేల మంది రష్యా నిపుణులు పనిచేస్తున్నారు. వీరిలో కొందరు గూఢచారులుగా పనిచేస్తున్నారేమో.. అని బ్రిటన్‌ నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

బ్రిటన్‌ మాజీ ప్రధాని లిజ్‌ట్రస్‌ పర్సనల్‌ ఫోన్‌ను పుతిన్‌ కోసం పనిచేసే రష్యన్‌ ఏజెంట్లు హ్యాక్‌ చేసినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఆ హ్యాకర్ కూడా ఈ 1000 మందిలో ఒకడయ్యే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..