Earthquake: భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.6 నమోదు
Earthquake: ఈ మధ్య కాలంలో భూకంపాలు ఎక్కువగానే సంభవిస్తున్నాయి. భారత్‌లో పెద్ద ఎత్తున భూప్రకంపనలు సంభవించవు కానీ.. ఇతర దేశాల్లో మాత్రం భారీగా వస్తుంటాయి...
Earthquake: ఈ మధ్య కాలంలో భూకంపాలు ఎక్కువగానే సంభవిస్తున్నాయి. భారత్‌లో పెద్ద ఎత్తున భూప్రకంపనలు సంభవించవు కానీ.. ఇతర దేశాల్లో మాత్రం భారీగా వస్తుంటాయి. ఆస్తినష్టం, ప్రాణ నష్టం కూడా భారీగానే ఉంటుంది. ఇక తాజాగా పాపువా న్యూ గినియా దేశంలో భారీ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. పాపువా న్యూ గినియాలోని లైలో సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.6గా నమోదైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.భూకంపం ధాటికి ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. భూకంపం సంభవించగానే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పాపువా న్యూ గినియా అనేది ఇండోనేషియాకు సమీపంలోని పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలోని ఒక దేశం.
ఈ భూకంపం వల్ల భారీగానే నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అయితే ప్రాణ నష్టం గురించి ఎలాంటి సమాచారం లేదు. ఇంత భారీ భూకంపం చోటు చేసుకోవడంతో చాలా మంది మృతి చెంది ఉంటారని తెలుస్తోంది. కైనాంటు పట్టణానికి 67 కిలోమీటర్ల దూరంలో 61 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని, భూకంప కేంద్రం నుంచి 1000 కిలోమీటర్ల పరిధిలో సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే హెచ్చరించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి