9/11 Attacks: సెప్టెంబర్ 11.. అమెరికా వాసుల్లో మర్చిపోలేని రోజు.. ఆ చీకటి రోజుకు 21 ఏళ్లు
9/11 Attacks: సెప్టెంబర్ 11.. ఈ తేదీ ఇప్పటికీ అమెరికా వాసుల్లో మర్చిపోలేని రోజు. ఈ రోజు గుర్తుకు రాగానే అందరి గుండెల్లో దడ పుడుతుంమది. అమెరికాలోని న్యూయార్క్..
9/11 Attacks: సెప్టెంబర్ 11.. ఈ తేదీ ఇప్పటికీ అమెరికా వాసుల్లో మర్చిపోలేని రోజు. ఈ రోజు గుర్తుకు రాగానే అందరి గుండెల్లో దడ పుడుతుంమది. అమెరికాలోని న్యూయార్క్ ట్విన్ టవర్స్ మీద 9/11 దాడులు జరిగి నేటికి 21 సంవత్సరాలు. పూర్తయ్యింది. ఈ దాడిలో 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి దృశ్యం బాధితుల ముందు ఇంకా కదలాడుతూనే ఉంది. సెప్టెంబరు 11, 2001న అమెరికా దేశంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన ఆల్‌ఖైదా ఉగ్రవాదులు జరిపిన దాడులు చరిత్ర మరవలేదు. ఒక్క అమెరికాయే కాదు ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా ఈ ఘటనతో ఉలిక్కిపడ్డాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలపై ఒసామా బిన్ లాడెన్ బృందం పక్కా ప్రణాళికతో జరిపిన దాడులవి. ఆ రోజు ఉదయం 10 మంది ఆల్‌ఖైదా ఉగ్రవాదులు.. నాలుగు ప్రయాణికుల జెట్ విమానాలను దారి మళ్లించి న్యూయార్క్ ట్విన్ టవర్స్ పైన దాడికి పాల్పడ్డారు. సౌదీ అరేబియా, ఇతర అరబ్ దేశాలకు చెందిన వారే ఈ ఘటనకు పాల్పడినట్లు దాడి జరిగిన తర్వాత దర్యాప్తులో పోలీసులు బృందాలు గుర్తించాయి. ఈ దారుణానికి ఒడిగట్టిన ఉగ్ర ముఠాకు అప్పటి ఆల్‌ఖైదా నాయకుడు ఓసామా బిన్ లాడెన్ నేతృత్వం వహించారు. ఈ దాడుల్లో 3,000 మంది బాధితులు, 19 మంది హైజాకర్లు మరణించారు.
ఇదిలావుంటే, 2001 సెప్టెంబర్ 11న నాలుగు ప్రయాణికుల విమానాలను ఇస్లామిస్ట్ మిలిటెంట్లు హైజాక్ చేశారు. ఆ విమానాలతో వరల్డ్ ట్రేడ్ సెంటర్, అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ తోపాటు, పెన్సిల్వేనియా ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడి చేశారు. అనుకోకుండా జరిగిన దాడితో.. చూస్తుండగానే, న్యూయార్క్ ట్విన్ టవర్స్ కుప్పకూలాయి.
బహుళ అంతస్తులతో కూడిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను రెండు విమానాలు ఢీకొన్నప్పుడు సుమారు 10,000 గ్యాలన్ల జెట్ ఇంధనం చిమ్ముకుంది. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దాదాపు 1,000 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి వల్ల భవనం పిల్లర్లు ఒక్కసారిగా వంగి విరిగాయి. స్లాబులు కూలిపోయాయి. పెద్దఎత్తున శబ్దాలతో భవనం నేలమట్టమైంది. ఒక అంతస్తు కూలిపోతే, దాని బరువు కింది అంతస్తుల మీద ఒక్కసారిగా పడటంతో అవి కూడా కూలిపోయాయి. పై అంతస్తులు కూలినప్పుడు ఒక్కసారిగా భారీ మొత్తంలో దుమ్ము, ధూళీ కిటికీల నుంచి బయటకు వచ్చింది. ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులందరూ, భవనాల్లో పనిచేస్తున్న అనేక మంది ఇతరులు దుర్మరణం పాలయ్యారు.
మూడో విమానాన్ని హైజాకర్లు వాషింగ్టన్ కి వెలుపల ఉన్న ఆర్లింగ్టన్, వర్జీనియాలోని పెంటగాన్‌పైకి వదిలారు. నాలుగో విమానాన్ని అందులోని కొందరు ప్రయాణీకులు, విమాన సిబ్బంది ఎదురు తిరగడంతో గ్రామీణ పెన్సిల్వేనియాలోని షాంక్స్‌విల్లేకి సమీపంలో ఉన్న ఒక మైదాన ప్రాంతంలో కుప్పకూలిపోయింది. దీనిని హైజాకర్లు వాషింగ్టన్ డీసీ వైపుకు మళ్లించారు. విమానాల్లో ప్రయాణించిన ఏ ఎక్కరూ ప్రాణాలతో బయటపడలేదని వార్తా సంస్థలు వెల్లడించాయి.
అయితే, న్యూయార్క్ ప్రభుత్వారోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. ఆ నాటి దాడుల్లో మూడు వేల మంది అశువులుబాసారు. ఇందులో నాలుగు విమానాలకు సంబంధించి ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది, సాధారణ పౌరులు ఉన్నారు. అలాగే, సహాయక చర్యల్లో పాల్గొన్న అగ్నిమాపక దళ సిబ్బంది, పోలీసులు 836 మంది మరణించారు. జంట భవనాలు కుప్పకూలిన ఘటనలో దుర్మరణం పాలైన మొత్తం బాధితుల్లో 343 మంది అగ్నిమాపక దళ సిబ్బంది, 60 మంది న్యూయార్క్ నగరం, పోర్ట్ అథారిటీలకు చెందిన పోలీసు అధికారులు ఉన్నారు. ఇంకా పెంటగాన్ భవనంపై జరిగిన దాడుల్లో 184 మంది సహాయక సిబ్బంది కూడా ప్రాణాలొదిలారు. మరణించిన వారిలో అత్యధికులు సాధారణ పౌరులే. వారిలో 70కి పైగా ఇతర దేశాలకూ చెందినవారు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కులు చెబుతున్నాయి. కాగా, ప్రపంచ వ్యాప్తంగా రక్షణ రంగంలో ఎంతో శక్తివంతమైనదని చెప్పుకునే అమెరికా ఆల్‌ఖైదా ఉగ్రవాదులు పక్కా ప్రణాళికతో అనుకున్న విధంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పైన దాడులు జరపగలిగింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి