Mehul Choksi: ‘వాటిని పరిగణలోకి తీసుకోం’.. మెహుల్‌ చోక్సీకి బెయిల్ నిరాకరించిన డొమినికా కోర్టు

|

Jun 12, 2021 | 9:49 AM

Dominica - Mehul Choksi’s bail: పంజాబ్‌ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో భారత్ నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చోక్సీకి బెయిల్‌ ఇచ్చేందుకు

Mehul Choksi: ‘వాటిని పరిగణలోకి తీసుకోం’.. మెహుల్‌ చోక్సీకి బెయిల్ నిరాకరించిన డొమినికా కోర్టు
Mehul Choksi
Follow us on

Dominica – Mehul Choksi’s bail: పంజాబ్‌ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో భారత్ నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చోక్సీకి బెయిల్‌ ఇచ్చేందుకు డొమినికా హైకోర్టు నిరాకరించింది. డొమినికాతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, దేశం విడిచి పారిపోనని ఇచ్చిన హామీని డొమినికా కోర్టు పరిగణలోకి తీసుకోమని తేల్చి చెప్పింది. తన సోదరుడితో కలిసి ఉంటానని కోర్టుకు తెలుపగా.. అది స్థిర నివాసం కాదంటూ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. అక్రమంగా డొమినికాలోకి ప్రవేశించారన్న ఆరోపణలపై ఇటీవల ఆ దేశ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు బెయిల్ పిటిషన్‌ను 11వ తేదీకి వాయిదా వేసింది. దీనిపై శుక్రవారం డొమినికా కోర్టులో ఇరు పక్షాలు వాదనలు వినిపించాయి.

అయితే.. చోక్సీపై ఇంకా విచారణ ప్రారంభం కాలేదని కోర్టు అభిప్రాయపడింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి బెయిల్‌ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. బెయిల్‌ కోసం బలమైన పూచీకత్తు ఇవ్వలేదని, విదేశాలకు పారిపోయే అవకాశం ఉండడంతో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలిపారు. చోక్సీకు విమాన, పలు ప్రమాదాలు ఉన్నాయని కూడా కోర్టులో తెలుపగా.. వాటిని కోర్టు తోసిపుచ్చింది.

మే 23న చోక్సీ విందు కోసం డొమినికాకు వెళ్లగా.. ఆయన అక్రమంగా ప్రవేశించినట్లు పోలీసులు అభియోగాలు మోపుతూ అరెస్టు చేశారు. ఆంటిగ్వా నుంచి భారత్‌కు రప్పించేందుకు సీబీఐ, ఈడీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో క్యూబా పారిపోయేందుకు ప్రయత్నించిన చోక్సీ డొమినికాలో పట్టుబడ్డారు.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంలో రూ.13,500 కోట్ల రుణం ఎగవేత కేసులో నిందితుడిగా ఉన్న మెహుల్‌ చోక్సీ 2018లో భారత్‌ విడిచి ఆంటిగ్వా బార్బుడాకు పారిపోయిన విషయం తెలిసిందే. ఆయనతోపాటు నీరవ్ మోదీ కూడా యూకేకు పారిపోయారు. వీరిద్దరినీ భారత్‌కు తీసుకువచ్చేందుకు సీబీఐ, ఈడీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

Also Read:

Punjab Police: ఉగ్ర కుట్ర భగ్నం.. పెద్ద ఎత్తున విదేశీ పిస్టళ్లు స్వాధీనం.. ఒకరి అరెస్ట్

Boy life Safe: మూడేళ్ల చిన్నారి ప్రాణం నిలిపిన ఇంజక్షన్‌ ఖరీదు 16 కోట్లు.. క్రౌడ్ ఫండింగ్ ద్వారా అపన్న హస్తం అందించిన దాతలు