సాయం చేయండి.. ట్రంప్‌కు పాక్ మొర

పాక్ మరోసారి వాషింగ్టన్ తలుపులు తట్టింది. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ..అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కొద్దిసేపు మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లొ నెలకొన్న పరిస్థితులను ట్రంప్‌కు వివరించారు. ఎలాగైనా ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా ఆయనకు ఇమ్రాన్ విఙ్ఞప్తి చేశారు. ఇమ్రాన్ – ట్రంప్‌ల సంభాషణ వివరాలను పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ మీడియాకు వివరించారు. అధ్యక్షుడు ట్రంప్ కశ్మీర్ విషయంలో కలుగజేసుకుని ఢిల్లీ ..ఇస్లామాబాద్‌ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన విషయంలో సహాయం […]

సాయం చేయండి.. ట్రంప్‌కు పాక్ మొర
Follow us

| Edited By:

Updated on: Aug 20, 2019 | 3:03 AM

పాక్ మరోసారి వాషింగ్టన్ తలుపులు తట్టింది. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ..అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కొద్దిసేపు మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లొ నెలకొన్న పరిస్థితులను ట్రంప్‌కు వివరించారు. ఎలాగైనా ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా ఆయనకు ఇమ్రాన్ విఙ్ఞప్తి చేశారు.

ఇమ్రాన్ – ట్రంప్‌ల సంభాషణ వివరాలను పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ మీడియాకు వివరించారు. అధ్యక్షుడు ట్రంప్ కశ్మీర్ విషయంలో కలుగజేసుకుని ఢిల్లీ ..ఇస్లామాబాద్‌ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన విషయంలో సహాయం చేయాలని కోరినట్టుగా తెలిపారు. అయితే ట్రంప్ తప్పకుండా సాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు ఖురేషీ. అదే విధంగా ఇంటర్నేషన్ హ్యూమన్ రైట్స్ ప్రతినిధులకు కూడా ఇమ్రాన్ ఒక విఙ్ఞప్తి చేశారని జమ్ము కశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను కళ్లారా చూడాలని కోరినట్టుగా విదేశాంగ మంత్రి తెలిపారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్‌కు సాయం చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ఆదేశం ఒంటరైనట్టుగా కనిపిస్తోంది. అయితే గత వారం చైనా ప్రొద్బలంతో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం జరిగింది. అది కూడా అర్ధాంతరంగానే ముగిసింది. దీంతో ఇప్పుడు మరోసారి సాయం కోసం అమెరికాను వేడుకుంటున్నట్టుగా అనిపిస్తోంది.