Viral Video: భూమి లోపల దట్టమైన అడవి.. చైనాలో ఊహించని అద్భుతం

|

May 22, 2022 | 1:03 PM

చైనాలో(China) అద్భుతం జ‌రిగింది. ఒక పురాతనమైన అడవి వెలుగులోకి వచ్చింది. భూమి పైన కాదండోయ్.. భూమిలోప‌ల. చైనాలోని గ్వాంగ్సీ జువాంగ్‌ అటానమస్‌ రీజియన్‌ లేయ్‌ కౌంటీలోని ఓ సింక్‌ హోల్‌లో మే ఆరో...

Viral Video: భూమి లోపల దట్టమైన అడవి.. చైనాలో ఊహించని అద్భుతం
China Sink Hole
Follow us on

చైనాలో(China) అద్భుతం జ‌రిగింది. ఒక పురాతనమైన అడవి వెలుగులోకి వచ్చింది. భూమి పైన కాదండోయ్.. భూమిలోప‌ల. చైనాలోని గ్వాంగ్సీ జువాంగ్‌ అటానమస్‌ రీజియన్‌ లేయ్‌ కౌంటీలోని ఓ సింక్‌ హోల్‌లో మే ఆరో తేదీన ఈ దట్టమైన అడవిని కనుగొన్నారు. ఈ సింక్‌హోల్(Sink Hole) అడుగున 40 మీట‌ర్ల ఎత్తైన చెట్లున్నాయి. అంటే కొబ్బరి చెట్లకంటే రెండింత‌లు ఎత్తయినవి అన్నమాట‌. దీని లోపల మొత్తం చెట్లతోనే విస్తరించి ఉంది. ఆ చెట్ల కొమ్మలు సింక్‌హోల్ పైవ‌ర‌కూ ఉన్నాయి. ఈ అడవి చూడ‌ముచ్చట‌గా ఉంద‌ని అన్వేష‌కులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైర‌ల్(Viral) అవుతోంది. కాగా ఈ సింక్‌హోల్‌ 1,004 అడుగుల పొడవు, 492 అడుగుల వెడల్పుతో 630 అడుగుల లోతుతో ఉంది. ఈ సింక్‌హోల్ ఘ‌న‌పరిమాణం 5 మిలియ‌న్ క్యుబిక్ మీట‌ర్లకు మించి ఉంది. ఇప్పటివరకు కనిపెట్టిన అన్ని సింక్‌హోల్స్‌లో ఇదే పెద్దదిగా చెబుతున్నారు. ఈ అడవిలో ఉన్న ప్రత్యేకమైన చెట్లు, ఇతర ప్రాంతాల్లో అంతరించిపోయిన మొక్కలు ఇంకా రకరకాల జీవులు ఉండి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

Viral Video: ఇది రేసు గుర్రం కాదు.. పక్కా మాస్ డ్యాన్స్ గుర్రం.. వీడియో చూస్తే షాకవుతారు..

Shani Jayanti 2022: శని జయంతి రోజున శనీశ్వరుడి ప్రసన్నం కోసం చేయాల్సిన పూజలు, నియమాలు ఏమిటంటే..