UK Omicron Variant Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా పీడ వెంటాడుతూనే ఉంది. కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయనుకుంటున్న క్రమంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయపెడుతోంది. తాజాగా ఒమిక్రాన్ ధాటికి బ్రిటన్ చిగురుటాకులా వణికిపోతోంది. రోజువారీ కేసులతో పోలిస్తే.. ఆదివారం కేసుల సంఖ్య ఒక్కసారిగా మూడు రేట్లు పెరిగింది. గత 24 గంటల్లో 90వేల కరోనా కేసులు బయటపడగా.. అందులో 10వేల కేసులు ఒమిక్రాన్ వేరియంట్‌వే ఉండటం ఆందోళన రేపుతోంది. అంతేకాకుండా ఒమిక్రాన్‌తో తొలి మరణం చోటు చేసుకున్న బ్రిటన్‌లో.. ప్రస్తుతం మరణాల సంఖ్య ఏడుకు చేరుకున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. బ్రిటన్‌లో శుక్రవారం 3,201 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. మరుసటి రోజు ఈ కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 10,059 కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయని తెలఅిపింది. దీంతో బ్రిటన్లో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 24,968కి పెరిగినట్లు యూకే ఆరోగ్య భద్రతా సంస్థ ఆదివారం తెలిపింది.
కాగా.. ఒమిక్రాన్ తీవ్రతతోపాటు.. సాధారణ కరోనా కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. గడిచిన 24గంటల్లోనే 90,418 కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తుంది. కరోనా తీవ్రత పెరుగుతుండటంతో.. ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించిందని బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావిద్ తెలిపారు. కేసుల నియంత్రణకు శాస్త్రవేత్తలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామంటూ వెల్లడించారు. వారిచ్చే సమాచారం తరువాత కఠిన లాక్‌డౌన్ ఆంక్షలు విధించాలా..? లేక మరికొన్ని కఠిన ఆంక్షలు విధించేందుకు ప్రయత్నిస్తున్నామంటూ వెల్లడించారు. గతేడాది కొవిడ్ విజృంభణ సమయంలో ఆసుపత్రిలో చేరికలతో పోలిస్తే ప్రస్తుతం తక్కువగానే ఉన్నట్లు వెల్లడించారు.
పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ వెంటిలేటర్ అవసరమయ్యే కేసుల సంఖ్య తక్కువగానే ఉందని పేర్కొన్నారు. అయితే.. క్రిస్మస్ పర్వదినానికి ఐదు రోజులే సమయం ఉండటంతో.. ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇదిలాఉంటే.. బ్రిటన్ NHS గణాంకాల ప్రకారం.. ఇంగ్లండ్‌లో 40 ఏళ్లు పైబడిన వారిలో మూడొంతుల మంది బూస్టర్-డోసులను కూడా తీసుకున్నారు.
Also Read: