Mia Khalifa: మియా ఖలీఫాపై దేశాధ్యక్షుడు సంచలన ఆరోపణలు.. స్వచ్ఛందంగానే చేస్తానని బదులిచ్చిన మాజీ పోర్న్‌స్టార్..

|

Jul 14, 2021 | 8:22 PM

Mia Khalifa: మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫాపై క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్ కానెల్ సంచలన ఆరోపణలు చేశారు. క్యూబాలో జరుగుతున్న

Mia Khalifa: మియా ఖలీఫాపై దేశాధ్యక్షుడు సంచలన ఆరోపణలు.. స్వచ్ఛందంగానే చేస్తానని బదులిచ్చిన మాజీ పోర్న్‌స్టార్..
Mia Khalifa
Follow us on

Mia Khalifa: మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫాపై క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్ కానెల్ సంచలన ఆరోపణలు చేశారు. క్యూబాలో జరుగుతున్న ఆందోళనకు మియా ఖలీఫానే ఆజ్యం పోస్తోందని ఆరోపించారు. ఇందుకోసం మియా ఖలీఫా అమెరికాతో కలిసి పని చేస్తోందన్నారు. ఓ మీడియా సమావేశంలో క్యూబా ప్రెసిడెంట్ ఈ వ్యాఖ్యలు చేయడం ఆ దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. క్యూబాలో పరిపాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు ఆజ్యం పోసేందుకు మియా ఖలీఫా అమెరికాతో కలిసి పని చేస్తోందన్నారు. అయితే, క్యూబా ప్రెసిడెంట్ ఆరోపణలపై మియా ఖలీఫా వెంటనే రియాక్ట్ అయ్యింది. మిగ్యుల్ డియాజ్ కానెల్ తనపై చేసిన ఆరోపణలను ఖండించింది. ఏ దేశంతోనూ కలిసి పని చేయాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం యేసింది. ‘‘దేశ ప్రజల మీరు ప్రదర్శిస్తున్న అమానవీయతను ఎత్తి చూపటానికి ఏ దేశ ప్రభుత్వంతో కలిపి పని చేయాల్సిన అవసరం లేదు. స్వచ్ఛందంగానే పోరాటం చేస్తాను’’ అని మియా ఖలీఫా ట్వీట్ చేసింది.

కాగా, క్యూబాలో మళ్లీ ప్రజాగ్రహం మళ్లీ వెల్లువెత్తుతోంది. 3 దశాబ్దాల తర్వాత క్యూబాలో పెద్ద ఎతున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా హవానాలో వేలాదిగా జనం నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అధ్యక్షుడు మిగ్యుల్‌ డియాజ్ కనెల్‌ రాజీనామాకు పట్టు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన అధ్యక్షుడు డియాజ్ కనెల్‌ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా ప్రోత్బలంతోనే.. ఈ నిరసనలు జరుగుతున్నాయని ఆరోపించారు.

Also read:

Section 66A: కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం.. సెక్షన్ 66-ఏ ఐటీ చ‌ట్టం కింద న‌మోదైన కేసులు ఎత్తివేత‌

OTT: ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లపై ఓ లుక్కేయండి.!

Coronavirus: తెలంగాణ రాష్ట్రంలో తగ్గుముఖం పడుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..!