Corona Virus: ప్రపంచంలో కరోనా వైరస్ బారిన పడిన మొదటి వ్యక్తి ఇతనే అంటూ ప్రకటించిన అమెరికా అధికారులు
ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడిన మొదటి వ్యక్తి ఎవరు? అనే ప్రశ్నలు గత మూడేళ్లుగా అనేకమంది మదిలో మెదులుతునే ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు. తాజాగా ఒక ప్రశ్నకు సమాధానంగా కరోనా బారిన పడిన మొదటి వ్యక్తి దొరికాడు, అదే సమయంలో ప్రమాదకరమైన కుట్ర కూడా బయటపడింది.

మానవాళి జీవితాన్ని కరోనా వైరస్ కంటే ముందు.. తర్వాత గా విభించవచ్చు. మూడేళ్లు ఓ రేంజ్ లో వణికించిన ఈ కరోనా వైరస్ ఎలా వ్యాపించింది? ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం సృష్టించిన ఈ వైరస్ ఎక్కడ నుండి వచ్చింది? ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడిన మొదటి వ్యక్తి ఎవరు? అనే ప్రశ్నలు గత మూడేళ్లుగా అనేకమంది మదిలో మెదులుతునే ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు. తాజాగా ఒక ప్రశ్నకు సమాధానంగా కరోనా బారిన పడిన మొదటి వ్యక్తి దొరికాడు, అదే సమయంలో ప్రమాదకరమైన కుట్ర కూడా బయటపడింది.
ఈ ప్రమాదకరమైన వైరస్ బాధితులు మొదట ముగ్గురు వ్యక్తులని యుఎస్ ప్రభుత్వానికి చెందిన చాలా మంది అధికారులు పేర్కొన్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు మరెవరో కాదు చైనాకు చెందిన ప్రసిద్ధ వుహాన్ ల్యాబ్ శాస్త్రవేత్తలు. బెన్ యు, పింగ్ యు , యాన్ జు అనే వెల్లడించారు. కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుండే ఉద్భవించిందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు గత మూడేళ్ళుగా అనుమానిస్తూనే ఉన్నారు.




వైరస్‌తో ప్రాణాంతకమైన ప్రయోగం బెన్ యు అనే వ్యక్తి కోవిడ్ వైరస్‌తో ప్రమాదకరమైన ప్రయోగాలు చేశాడని అమెరికా అధికారులు ఒక నివేదికలో పేర్కొన్నారు. అమెరికా అధికారులను చెప్పిన విషయాలను ప్రస్తావిస్తూ.. జర్నలిస్టులు మైఖేల్ షెల్లెన్‌బెర్గర్, మాట్ టాబీ వెల్లడించారు. బెన్ యు తన ఇద్దరు సహచరులతో కలిసి ఈ ఘోరమైన ప్రయోగాలు చేసినట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు.
“Sources within the US government say that three of the earliest people to become infected with SARS-CoV-2 were Ben Hu, Yu Ping, and Yan Zhu. All were members of the Wuhan lab suspected to have leaked the pandemic virus.” https://t.co/0v04KzJUCR
— Rand Paul (@RandPaul) June 14, 2023
ఈ పరిశోధన చేస్తున్న క్రమంలో బెన్ యుకు ఇన్ఫెక్షన్ సోకింది. కోవిడ్ సమయంలో కూడా ఇతడిలోనే మొదటిసారిగా లక్షణాలు బయల్పడ్డాయి. 2019 నుంచి ఈ శాస్త్రవేత్తలు వైరస్‌తో ప్రయోగాలు చేస్తున్నారు. కోవిడ్ గురించి ప్రపంచానికి చైనా ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో.. బెన్ యు ఆసుపత్రిలో చేరి సీక్రెట్ గా చికిత్స చేయించుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పబ్లిక్ అండ్ రాకెట్ అనే ఏజెన్సీ US ప్రభుత్వానికి చెందిన పలువురు శాస్త్రవేత్తలను ఉటంకిస్తూ ఈ విషయాన్ని పేర్కొంది. కోవిడ్‌కు గురైన మొదటి రోగి బెన్‌హు అని మీకు ఖచ్చితంగా తెలుసా అని ఈ శాస్త్రవేత్తలను అడిగినప్పుడు, వారు నూటికి నూరుశాతం నిజం అని చెప్పారు. వుహాన్ ల్యాబ్‌లోని ఈ శాస్త్రవేత్తలను ఎలా యుఎస్ సంస్థ చేరుకున్నదో వెల్లడించలేదు.
2017 నుంచి పరిశోధనలు
కోవిడ్-19 2019లో ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికించింది. అయితే చైనాలో ఈ రకమైన వైరస్ చాలా కాలంగా ఉంది. 2017 డిసెంబర్ కు సంబంధించిన వీడియో బయటపడింది. ఈ వీడియోలో కోవిడ్-19 వైరస్ ఉద్భవించిన ల్యాబ్‌లో బెన్ హు మాస్క్ లేదా కవర్ లేకుండా తిరుగుతున్నాడు. అంటే వ్యాక్సిన్‌ను తయారు చేయడానికి అనేక రకాల వైరస్‌లను ఉపయోగిస్తున్నారని చెబుతున్న ల్యాబ్‌లో భద్రత గురించి అస్సలు పట్టించుకోలేదని అంటున్నారు.
విధ్వంసం సృష్టించేందుకు ఆయుధాలు సిద్ధమయ్యాయి! వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన సీనియర్ సైంటిస్ట్ జి గెంగ్లీ గబ్బిలాలలో కనిపించే వైరస్‌పై పరిశోధన చేసినట్లు భావిస్తున్నారు. ఈ శాస్త్రవేత్తను ప్రజలు ‘బ్యాట్ వుమన్’ అని కూడా పిలుస్తారు. మానవ లక్షణాలతో ఎలుకలపై SARS వంటి వైరస్‌లను పరీక్షించడంలో నిమగ్నమై ఉన్నారు. ఈ పరిశోధన సమయంలో అనుకోకుండా ఈ వైరస్ బారిన పడ్డాడు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..