Covid-19: మళ్ళీ సింగపూర్‌లో విజృంభిస్తోన్న కరోనా.. ఒక్కరోజులో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

|

Jun 29, 2022 | 11:43 AM

సింగపూర్‌లో మార్చి 22న 13,166 COVID-19 కొత్త కేసులు నమోదు కాగా దాదాపు మూడు నెలల తర్వాత మళ్ళీ భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి.

Covid-19: మళ్ళీ సింగపూర్‌లో విజృంభిస్తోన్న కరోనా.. ఒక్కరోజులో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..
Singapore Covid Pandemic
Follow us on

Covid-19: దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి కరోనా వైరస్ ప్రపంచ మానవాళిని భయబ్రాంతులకు గురి చేస్తూనే ఉంది. రకరకాల రూపాలను సంతరించుకుని.. కల్లోలం సృష్టిస్తోంది.. గత కొన్ని నెలలుగా కరోనా అదుపులోకి వచ్చిందని భావిస్తున్న వేళ.. మళ్ళీ మనదేశం సహా అనేక దేశాల్లో కరోనా కొత్త కేసుల నమోదు పెరిగింది. సింగపూర్ గత 24 గంటల్లో  11,504 కొత్త COVID-19 కేసులను నమోదయ్యాయి. ఇది మూడు నెలల్లో అత్యధికమని ఆ దేశ ఆరోగ్య మంత్రి ఓంగ్ యే కుంగ్ చెప్పారు. అంతేకాదు..ఊహించిన దానికంటే వేగంగా కేసులు పెరుగుతున్నాయని.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. రానున్న వారాల్లోనూ కరోనా వైరస్‌ కేసులు మరింతగా పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు ఉప ప్రధాని లారెన్స్‌ వాంగ్‌ తెలిపారు.

అయితే ప్రస్తుతం తాము కరోనా సాధారణ వ్యాధిగానే పరిగణిస్తున్నామని.. ఈ దశలో COVID భద్రతా చర్యలను కఠినతరం చేయాల్సిన అవసరం లేదని కరోనా మల్టీ-మినిస్ట్రీ టాస్క్‌ఫోర్స్‌కు కో-చైర్‌ వాంగ్ చెప్పారు. ఒమిక్రాన్  కొత్త వేరియెంట్స్ BA.4 , BA.5 ఉప-వేరియంట్‌ల వల్ల ఇన్‌ఫెక్షన్ల సంఖ్య పెరుగుతుందని ఆయన చెప్పారు.

తాము కరోనా నెక్స్ట్ వేవ్ జూలై లేదా ఆగస్టులో ఉంటుందని గతంలో చెప్పానని.. అయితే కొంచెం ముందుగానే కొత్తవేవ్ అంటే.. జూన్ చివరిలోనే కొత్త వేవ్ వస్తుందన్నారు ఆరోగ్య మంత్రి ఓంగ్ యే కుంగ్.

ఇవి కూడా చదవండి

మంగళవారం మధ్యాహ్నం(జూన్ 28వ తేదీ) వరకు 11,504 కేసులు నమోదు కాగా.. కొత్త COVID-19 కేసులలో 10,732 స్థానిక కేసుల్ని.. 772 విదేశాల నుంచి వచ్చిన వారివని చెప్పారు. దేశంలో కరోనా మొత్తం మరణాల సంఖ్య 1,410కి చేరుకుంది. ఇప్పటివరకు 1,425,171 కోవిడ్ కేసులు నమోదయినట్లు సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

కొత్త కేసుల్లో 45 శాతం కోవిడ్ కేసులు BA.4 , BA.5 సబ్-వేరియంట్‌ల వల్ల సంభవించాయని.. ముందు వారం కంటే 30 శాతం అధికమని అన్నారు. సింగపూర్‌లో మార్చి 22న 13,166 COVID-19 కొత్త కేసులు నమోదు కాగా దాదాపు మూడు నెలల తర్వాత ఇప్పుడే అధికంగా కేసులు నమోదయ్యాయని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది.

కోవిడ్-19, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ , ఎంట్రోవైరస్ ఇన్ఫెక్షన్‌ల కారణంగా ఎన్‌సెఫాలిటిస్‌తో పసిపిల్లలు మరణించినట్లు సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. సింగపూర్ బాలుడికి ఇతర వ్యాధులున్న చరిత్ర లేదని మరియు అంతకుముందు బాగానే ఉన్నాడని పేర్కొంది. సింగపూర్‌లో COVID-19తో మరణించిన 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మొదటి వ్యక్తి..  18 నెలల బాలుడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..