Covid-19 B.1.617 variant: భారత్ కరోనా వేరియంట్.. 44 దేశాల్లో ప్రమాదకర బి.1.617 వైరస్ గుర్తింపు: డబ్ల్యూహెఓ

| Edited By: Team Veegam

May 22, 2021 | 10:30 AM

Covid-19 B.1.617 variant: భారత్‌లో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా నాలుగు

Covid-19 B.1.617 variant: భారత్ కరోనా వేరియంట్.. 44 దేశాల్లో ప్రమాదకర బి.1.617 వైరస్ గుర్తింపు: డబ్ల్యూహెఓ
India Covid-19 Deaths
Follow us on

Covid-19 B.1.617 variant: భారత్‌లో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా నాలుగు లక్షల కేసులు, నాలుగు వేలకు పైగా మరణాలు నమోదవుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. ముఖ్యంగా కేసుల పెరుగుదలకు భారత్‌లో అక్టోబరులో కనుగొన్న బి.1.617 కరోనా వేరియంట్ కారణమని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ మ్యూటేషన్ వేగంగా వ్యాపిస్తుందని.. ప్రమాదకర స్థాయికి తీసుకెళుతుందని హెచ్చరించింది. అయితే దీనివల్లనే కేసుల తీవ్రత పెరుగుతోందని వెల్లడించింది. అయితే.. తాజాగా డబ్ల్యూహెచ్ఓ మరో ప్రకటనను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా బి.1.617 వేరియంట్ వైరస్ ఓపెన్ యాక్సెస్ డేటా బేస్ ప్రకారం.. 44 దేశాల్లో దేశాల్లో కనుగొన్నట్లు బుధవారం వెల్లడించింది.

మొత్తం ఆరు డబ్ల్యూహెచ్‌ఓ రీజియన్ ప్రాంతాల్లో 44 దేశాల్లోని 4,500 శాంపిల్స్‌లో అత్యంత ప్రమాదకర వేరియంట్ కనుగొన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇంకా మరికొన్ని దేశాల్లో కూడా నిర్దారణ అవుతుందని.. మరో ఐదు దేశాల రిపోర్టులు అందాల్సి ఉందని పేర్కొంది. భారత్ వేరియంట్ కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతుందని బ్రిటన్ కూడా వెల్లడించింది. కోవిడ్ పలు వేరియంట్ల రూపంలో మార్పుచెందుతోందని.. అందులో బి.1.617 వేరియంట్ ప్రమాదకరమని వెల్లడించింది. అందుకే భారత్‌లో కేసులు పెరుగుతున్నాయని.. ఇది ఆందోళనకర విషయంగా పరిగణించాలని సూచించింది.

అసలు కోవిడ్ కంటే.. ఈ వేరియంట్ ఎక్కువగా వేగంగా వ్యాప్తి చెందుతుందని పేర్కొంది. B.1.617 లాంటి వేరియంట్ల కలిగిన మరో మూడింటిని బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలో మొదట కనుగొన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే ఈ మేరియంట్లపై వ్యాక్సిన్ల ప్రభావం ఎంతమేర ఉంటుందనేది ఆలోచించాల్సిన విషయమని తెలిపింది.

Also Read:

మనిషి తనకు తానుగా భయం, కట్టుబాట్లు, మూడ నమ్మకాల నుంచి విముక్తి పొందాలి.. నేడు జిడ్డు కృష్ణమూర్తి జయంతి..

Horoscope Today: మే 12 బుధవారం రాశిఫలాలు… వీరికి మానసిక ఒత్తిడి తగ్గుతుంది.. ఆర్థికంగా మెరుగుపడతారు..