Covaxin: కోవిడ్ ఆల్ఫా, డెల్టా వేరియంట్లను కట్టడి చేస్తున్న కోవాక్సిన్‌.. ఎన్‌ఐహెచ్‌ అధ్యయనంలో వెల్లడి

Covaxin vaccine: కరోనావైరస్ పూర్తిగా సమసిపోక ముందే.. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. నలుదిక్కులా పుట్టుకొస్తున్న కొత్త వేరియంట్లు ఇప్పటికే

Covaxin: కోవిడ్ ఆల్ఫా, డెల్టా వేరియంట్లను కట్టడి చేస్తున్న కోవాక్సిన్‌.. ఎన్‌ఐహెచ్‌ అధ్యయనంలో వెల్లడి
Covaxin Vaccine

Updated on: Jun 30, 2021 | 9:07 AM

Covaxin vaccine: కరోనావైరస్ పూర్తిగా సమసిపోక ముందే.. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. నలుదిక్కులా పుట్టుకొస్తున్న కొత్త వేరియంట్లు ఇప్పటికే పలు దేశాలను వణికిస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలోని ఫార్మా దిగ్గజం.. భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాక్సిన్ కరోనా కొత్త వేరియంట్లు ఆల్ఫా, డెల్టా వేరియంట్లపై సమర్థవంతంగా పని చేస్తున్నట్లు వెల్లడైంది. అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఎన్‌ఐహెచ్‌) కొత్త వేరియంట్లపై భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ వాక్సిన్ తో అధ్యయనం నిర్వహించింది. ఈ క్రమంలో.. ఆల్ఫా, డెల్టా వేరియంట్లను సమర్థవంతంగా తటస్థం చేసే ప్రతిరోధకాలను కోవాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం భారత్‌తో పాటు పలు దేశాల్లో అత్యవసర వినియోగం కింద కోవాక్సిన్‌ పంపిణీ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఎన్ఐహెచ్.. కొత్త వేరియంట్లపై పరిశోధనలు నిర్వహించింది.

కోవాగ్జిన్‌ టీకా తీసుకున్న వ్యక్తుల నుంచి సేకరించిన రక్త నమూనాలపై SARS-CoV-2 ఆల్ఫా (B.1.1.7) డెల్టా (B.1.617) వేరియంట్లను సమర్థవంతంగా తటస్థం చేసే ప్రతి రోధకాలను ఉత్పత్తి చేసిందని ఎన్‌ఐహెచ్‌ మంగళవారం వెల్లడించింది. కోవ్యాక్సిన్ టీకా కరోనాపై వంద శాతం పని చేస్తోందని ఎన్ఐహెచ్ డైరెక్టర్ ఆంథోనీ ఫౌసీ పేర్కొన్నారు. కోవిడ్ లక్షణాలున్న వారిపై 78శాతం, కరోనాతో పాటు ఇతర వ్యాధులు ఉన్నవారిపై 70 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని తమ పరిశోధనలో తేలిందని ఫౌసీ వివరించారు. ఎన్‌ఐఏఐడీ మద్దతుతో అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ భారత్‌లో ప్రజలకు అందుబాటులో ఉన్న సమర్థవంతమైన వ్యాక్సిన్లలో ఒకటిగా భాగమైనందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అయితే ఈ కోవాక్సిన్‌ ద్వారా మరికొన్ని పరిశోధనలు చేయనున్నట్లు వెల్లడించారు.

Also Read:

Cabinet meeting: ఇవాళ కేంద్ర మంత్రి వర్గ కీలక సమావేశం… కేబినెట్ విస్తరణపై ఫోకస్..

Cylinder Blast: గ్యాస్ సిలిండర్ పేలి.. ఒకే కుటుంబంలోని నలుగురు దుర్మరణం..