Corona Virus: ఆ దేశంలో రికార్డ్ స్థాయిలో ఒక్కరోజులో 6 లక్షల కరోనా కొత్త కేసులు.. ఆసియా దేశాల్లో మళ్ళీ పెరుగుతున్న బాధితులు

|

Mar 17, 2022 | 3:54 PM

Corona Virus: ఓ వైపు భారత దేశం(India)లో కరోనా థర్డ్ వేవ్(Third wave) అదుపులోకి వచ్చి.. తక్కువ కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు గత కొన్ని రోజులుగా 3 వేల దిగువకు నమోదవుతూ కొంచెం ఉపశమనం..

Corona Virus: ఆ దేశంలో రికార్డ్ స్థాయిలో ఒక్కరోజులో 6 లక్షల కరోనా కొత్త కేసులు.. ఆసియా దేశాల్లో మళ్ళీ పెరుగుతున్న బాధితులు
S Korea Reports Record Case
Follow us on

Corona Virus: ఓ వైపు భారత దేశం(India)లో కరోనా థర్డ్ వేవ్(Third wave) అదుపులోకి వచ్చి.. తక్కువ కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు గత కొన్ని రోజులుగా 3 వేల దిగువకు నమోదవుతూ కొంచెం ఉపశమనం కలిగిస్తున్నాయి. అయితే ఆసియా(Asia)లోని పలు దేశాల్లో మరోసారి కరోనా కేసులు పెరుగుతుండడంతో  ప్రజలను ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కరోనా వ్యాప్తి పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కూడా ఆందోళన వ్యక్తం చేసింది. చైనా, హాంకాంగ్, సింగపూర్ తర్వాత ఇప్పుడు దక్షిణ కొరియాలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గురువారం.. దక్షిణ కొరియాలో 6 లక్షలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఒక్క రోజులో ఇన్ని కరోనా ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదు కాలేదు. అంతేకాదు ఆ దేశంలో గత ఏడాది జనవరిలో తొలి కోవిడ్‌ కేసు వెలుగు చూసిన తర్వాత దేశంలో ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.

  1. భారీగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు:దక్షిణ కొరియాలో రోజూ భారీ సంఖ్యలో కోవిడ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. దీంతో భారీగా కొత్త ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదయ్యాయని కొరియా వైద్య సిబ్బంది చెప్పారు. గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 6,21,328 కరోనా కేసులు నమోదయ్యాయి. 429 మంది మరణించారు. అయితే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినవారు ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా మారకముందే.. తగిన చికిత్స తీసుకోవాలని సూచించింది. ఆరోగ్య పరిస్థితి విషమించకముందే ఆసుపత్రిలో చేరాలని కొరియన్ అధికారులు బాధితులకు సూచించారు.
  2. మరణాల రేటు విషయంలో ఉపశమనం: అయితే దక్షిణ కొరియాలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నప్పటికీ, వైరస్ మరణాల రేటు తక్కువగా ఉన్న దేశాల్లో దక్షిణ కొరియా ఒకటిగా నిలిచింది. ఇది కరోనా కేసుల్లో ఉపశమనం కలిగించే విషయం. సాధారణంగా, కరోనా సంక్రమణ రేటు పెరిగినప్పుడు, దాని మరణాల రేటు కూడా పెరుగుతుంది, అయితే ఇది దక్షిణ కొరియా ఇందుకు మినహాయింపు.
  3. దేశంలో లాక్‌డౌన్: కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన సమయం నుంచి ఇప్పటి వరకూ ఈ దేశంలో లాక్‌డౌన్ విధించలేదు. అసలు అక్కడ ప్రభుత్వాలు ఆదిశగా ఆలోచనలు చేయలేదు. ఈ  కరోనా  అంటువ్యాధిని ఎదుర్కోవటానికి.. సాంప్రదాయేతర వ్యూహన్ని అమలు చేస్తున్నారు. దక్షిణ కొరియాలో కరోనా నిర్ధారణ కోసం వేగవంతమైన పరీక్షలు, హై-టెక్ కాంటాక్ట్ ట్రేసింగ్‌ను ఉపయోగిస్తోంది.  2020 సంవత్సరం ప్రారంభం నుండి.. ఇప్పటి వరకూ ఈ ఈదేశంలో 8 మిలియన్లకు పైగా కేసులు నమోదయ్యాయి.

Also Read: Tata UPI Payments: టాటా నుంచి యూపీఐ పేమెంట్ యాప్‌.. ఎన్‌పీసీఐ క్లియరెన్స్ కోరుతూ దరఖాస్తు..!

Holi 2022: కార్యకర్తలతో జేసీ హొలీ సంబరాలు.. తనయుడితో కలిసి డీజే పాటకు స్టెప్స్ వేస్తూ సందడి