Coronavirus Cases World: ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్నంటే.!

Coronavirus Cases World: కరోనా వైరస్ మొత్తం ప్రపంచ దేశాలన్నింటిని చుట్టేసింది. ఏడాది గడుస్తున్నా కూడా.. ప్రతీ రోజూ నమోదయ్యే పాజిటివ్ కేసులు..

Coronavirus Cases World: ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్నంటే.!
Follow us

|

Updated on: Feb 04, 2021 | 10:04 PM

Coronavirus Cases World: కరోనా వైరస్ మొత్తం ప్రపంచ దేశాలన్నింటిని చుట్టేసింది. ఏడాది గడుస్తున్నా కూడా.. ప్రతీ రోజూ నమోదయ్యే పాజిటివ్ కేసులు, మరణాలకు మాత్రం బ్రేక్ పడట్లేదు. ఇదిలా ఉంటే మరోవైపు యూకేలో పుట్టిన కొత్తరకం వైరస్ ప్రజలను మరింత భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఇది కరోనా కన్నా 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు ప్రకటించడంతో దేశాలన్నీ కూడా మరోసారి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి. ఇక తాజాగా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 105,092,533కి చేరింది. గడిచిన 24 గంటల్లో 4,93,061 పాజిటివ్ కేసులు.. 14,265 మరణాలు సంభవించాయి. అటు ఇప్పటిదాకా 2,283,151 మంది వైరస్ కారణంగా మరణించగా.. 76,826,118 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో ప్రతీ రోజూ భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 27,162,000కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 462,236 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, స్పెయిన్, యూకేలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా బ్రిటన్, ఆఫ్రికా దేశాల్లో కొత్తరకం ‘స్ట్రెయిన్’ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచమంతా ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇండియాలో ఇప్పటివరకు 10,802,458 పాజిటివ్ కేసుల కేసులు నమోదు కాగా.. 154,835 మంది వైరస్ కారణంగా మరణించారు.

మరిన్ని చదవండి:

మీ వెహికిల్‌ను అమ్మేసినా.. RC ట్రాన్స్‌ఫర్ కాలేదా.? అయితే ఇలా చేయండి..

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అనుమానంతో భార్యను కిరాతకంగా.. పక్కా ప్లాన్‌ ప్రకారమే..

టీమిండియాకు ప్రపంచకప్ అందించాడు.. ఏడాది పాటు నిషేధం ఎదుర్కున్నాడు.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే.?

కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారా.? అయితే ఈ ఐలాండ్‌లో జాలీగా హాలీడేను ఎంజాయ్ చేయండి..!