పాకిస్తాన్‌పై మరో దేశం సర్జికల్ స్ట్రైక్.. ఉగ్రవాదుల చెర నుంచి తమ సైనికులకు విడిపించుకున్న ఇరాన్
ఇరాన్ దేశ సైనికులు పాకిస్తాన్‌లో సర్జికల్ స్ట్రైక్ చేసి తమ గార్డులను విడిపించుకుంది. ఈ ఆపరేషన్‌లో ఆగ్నేయ ఇరాన్‌లోని ఐఆర్‌జిసి గ్రౌండ్ ఫోర్స్ కుడ్స్ బేస్ గార్డ్స్ పాల్గొన్నారు.
Surgical Strike on Pakistan: పాకిస్తాన్‌లో ఇరాన్ సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తుంది. బలూచ్ ఉగ్రవాదుల చేరలో ఉన్న తమ సైనికులను విడిపించుకుంది. మూడేళ్ల క్రితం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు సరిహద్దు గార్డులను కిడ్నాప్ చేసి దాచిపెట్టారు. దీంతో ఇరాన్ దేశ సైనికులు పాకిస్తాన్‌లో సర్జికల్ స్ట్రైక్ చేసి గార్డులను విడిపించుకుంది. ఈ ఆపరేషన్‌లో ఆగ్నేయ ఇరాన్‌లోని ఐఆర్‌జిసి గ్రౌండ్ ఫోర్స్ కుడ్స్ బేస్ గార్డ్స్ విజయవంతంగా నిర్వహించారు.
ఇరాన్ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 2వ తేదీన రాత్రి సమయంలో ఈ సర్జికల్ స్ట్రైక్ జరిగింది. దీనికి సంబంధించి పాకిస్తాన్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారి భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ దెబ్బకొట్టింది. పాకిస్తాన్ మిలటరీకి ఏ మాత్రం అందకుండా వారి దేశం లోపలికి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ చేసి తమ వారిని విడిపించుకుంది. వారిని జైష్ ఉల్ అదుల్ అనే సంస్థ రెండున్నరేళ్ల క్రితం కిడ్నాప్ చేసింది. ఈ సర్జికల్ స్ట్రైక్‌లో, ఉగ్రవాదుల డెన్‌కు కాపాలాగా ఉన్న కొందరు ఆర్మీ అధికారులు చనిపోయినట్టు సమాచారం. ఇరాన్‌కు చెందిన ఎలైట్ రివ్యూషనరీ గార్డ్స్ ఈ ఆపరేషన్ పాల్గొన్నట్లు సమాచారం. పాకిస్తాన్‌లో ఉన్న తమ ఇంటెలిజెన్స్ విభాగం అందించిన సమాచారం మేరకు దాడి చేసినట్లు ఎలైట్ రివ్యూషనరీ గార్డ్స్ ప్రకటించుకుంది.
పాకిస్తాన్‌పై జరిపిన సర్జికల్ స్ట్రైక్ విజయవంతం అయిందని ఇరాన్ ప్రకటించింది. ‘ఫిబ్రవరి 3న మంగళవారం సర్జికల్ స్ట్రైక్ చేశాం. గతంలో కిడ్నాప్‌నకు గురైన బోర్డర్ గార్డులను ఇద్దరినీ రక్షించాం.’ అని ఓ ప్రకటనలో పేర్కొంది. సర్జికల్ స్ట్రైక్ చేసిన ఇరాన్ సైనికులు క్షేమంగా తమ దేశానికి కూడా వచ్చేశారని ఆ ప్రకటనలో తెలిపింది.
2018 అక్టోబర్ 16న ఇరాన్ – బలూచిస్తాన్ సరిహద్దుల వద్ద గొడవల్లో 12 మంది సైనికులను పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్ ఉల్ అదుల్ కిడ్నాప్ చేసింది. అయితే, ఈ ఘటన అనంతరం మిలటరీ అధికారులు ఓ జాయింట్ కమిటీగా ఏర్పడి రెండు దేశాల మధ్య సయోధ్యను కుదిర్చారు. కిడ్నాప్ చేసిన వారిలో ఐదుగురిని 2018 మే 15న రిలీజ్ చేశారు. మరో నలుగురిని 2019 మే 21 మిలటరీ అధికారులు రక్షించారు. ఇప్పుడు ఇద్దరు సైనికులను రక్షించినట్టు ఇరాన్ ప్రకటించింది.
చెందిన రాడికల్ వహాబీ ఉగ్రవాద సంస్థ జైష్ ఉల్ అదుల్ అనేది మిలటరీ ఆర్గనైజేషన్. దీన్ని ఇరాన్ ఉగ్రవాద సంస్థగా గతంలో ప్రకటించింది. ఇరాన్ మీద ఈ సంస్థ పెద్ద ఎత్తున ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తోంది. ఆగ్నేయ ఇరాన్‌లో సున్నీ ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ సంస్థ తమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇరాన్ సైనికులతో పాటు , ప్రజల మీద కూడా పలుమార్లు ఉగ్రదాడులు చేసినట్లు ఇరాన్ పేర్కొంది. ఫిబ్రవరి 2019 లో ఇరాన్‌లోని బాసిజ్ పారామిలిటరీ స్థావరంపై దాడికి పాల్పడింది. ఓ బస్సుపై జరిపిన ఉగ్రవాద దాడిలో డజన్ల కొద్దీ ఐఆర్జిసి సభ్యులను చంపి గాయపరిచింది. దీనికి పాకిస్తాన్ ఆర్మీ సహకారం ఉందని ఇరాన్ నిఘావర్గాలు వెల్లడించాయి.
మరోవైపు, పాకిస్తాన్ భూభాగాల్లో ఉగ్రవాద గ్రూపులు ఉండటంపై ఇరాన్ మిలటరీ, పోలీసు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ సైన్యం సరిహద్దు పోలీసులపై నియంత్రణ లేదని విమర్శించారు.
ఇదీ చదవండి… మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నానా పటోల్ రాజీనామా.. ఆయన అందుకోసమే వైదొలిగారా..?