బ్రిటన్ (Britan) ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేసినప్పటి నుంచి తదుపరి ప్రధాని పదవి చేపట్టే విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్ కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు అంచనా వేశారు. ఈ మేరకు కన్జర్వేటివ్ పార్టీ సీనియర్ ఎంపీ, మాజీ మంత్రి మైఖేల్ గోవ్ (Michael Gove) కీలక విషయాలు వెల్లడించారు. ప్రధాని పదవి చేపట్టేందుకు అవసరమైన అన్ని అర్హతలు రిషి సునాక్ (Rishi Sunak) కు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. బ్రిటన్ ఎదుర్కొంటున్న జీవన వ్యయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఇస్తున్న హామీలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయని విమర్శించారు. అంతే కాకుండా లిజ్ ట్రస్ ప్రకటిస్తున్న పన్ను కోత హామీలు అర్థరహితమని వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయంపై రిషి సునాక్ మాత్రం సరైన వాదనలు చేస్తూ ప్రజలకు నిజాలు చెబుతున్నారని ప్రశంసించారు. అందుకే ప్రధాని పదవికి కావలసిన అన్ని అర్హతలు రిషి సునాక్ కు ఉన్నాయని తన మనసులో మాటను బయటపెట్టారు. ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వచ్చే వరకు ప్రభుత్వ ఖర్చులు, రుణాలను తగ్గించుకునే వరకు సాధారణ పన్నుల్లో కోతలు విధించలేమని మైఖేల్ చెప్పారు. అయితే ఖర్చులనూ అంత వేగంగా తగ్గించుకోవడం వేగంగా అయ్యే ప్రక్రియ కాదని, ఇందుకు సమయం పడుతుందని పేర్కొన్నారు.
“I know what the job requires. And Rishi has it”
ఇవి కూడా చదవండిBrilliant news to have @michaelgove on team #Ready4Rishi.
Read More: https://t.co/tsTSS0A9nq pic.twitter.com/6mOm4YLEsl
— Rishi Sunak (@RishiSunak) August 20, 2022
కాగా.. బ్రిటన్ ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ గతంలో రాజీనామా చేశారు. మంత్రుల తిరుగుబాటుతో ఆయన తన పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. 48 గంటల్లో 54 మంది మంత్రులు తిరుగుబాటు చేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో బోరిస్ జాన్సన్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. జూన్ 6న జరిగిన పార్టీ అవిశ్వాస తీర్మానం నుంచి జాన్సన్ గట్టెక్కారు. అయితే నెలరోజుల్లోనే పరిస్థితి మారిపోయింది. బోరిస్ జాన్సన్ స్థానంలో రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రిషి.. ఇన్ఫోసిస్ ఛైర్మన్ నారాయణమూర్తికి అల్లుడు. అయితే బ్రిటన్ ప్రధానిగా 2 సంవత్సరాల 349 రోజులు బోరిస్ జాన్సస్ అధికారంలో కొనసాగారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..