Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మాతృవియోగం.. ముగిసిన అంత్యక్రియలు..

కాంగ్రెస్ ​తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి మాతృవియోగం జరిగింది. సోనియా తల్లి పౌలా మైనో మంగళవారం తుదిశ్వాస విడిచారు.

Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మాతృవియోగం.. ముగిసిన అంత్యక్రియలు..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 31, 2022 | 5:48 PM

Sonia Gandhi mother passes away: కాంగ్రెస్ ​తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి మాతృవియోగం జరిగింది. సోనియా తల్లి పౌలా మైనో మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈనెల 27న ఇటలీలోని తన ఇంట్లో ఆమె చనిపోగా.. మంగళవారం పావోలా మైనో మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్​విభాగం ఇంఛార్జ్​ జైరాం రమేశ్ ట్విట్టర్ ద్వారా బుధవారం వెల్లడించారు. కాగా.. ప‌వోలా మైనో అంత్యక్రియలకు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ హాజ‌ర‌య్యారా.. లేదా..? అనే వివ‌రాల‌ను మాత్రం జైరామ్ ర‌మేశ్ వెల్లడించలేదు.

అయితే.. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ కొద్దిరోజుల క్రితమే ఇటలీ వెళ్లినట్లు సమాచారం. వైద్యపరీక్షల కోసం ఆమె విదేశాలకు వెళ్తున్నారని కాంగ్రెస్​పార్టీ గత వారం ఓ ప్రకటన ద్వారా పేర్కొంది. కుమారుడు రాహుల్‌గాంధీ, కుమార్తె ప్రియాంకాగాంధీ ఆమెకు తోడుగా వెళ్తారని వెల్లడించారు. అయితే, సోనియా ఎక్కడికి, ఎప్పుడు వెళ్తున్నారన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. అయితే.. ఢిల్లీకి వచ్చేముందు అస్వస్థతతో ఉన్న తన తల్లిని సోనియా పరామర్శిస్తారనొ జైరాం రమేశ్‌ తెలిపారు. ఇంతలోనే సోనియా తల్లి మరణించారని, బుధవారం అంత్యక్రియలు నిర్వహించారని ఆయన వెల్లడించారు.

ఇట‌లీకి చెందిన సోనియాను రాజీవ్‌గాంధీ ప్రేమ వివాహం చేసుకున్నారు. రాజీవ్‌గాంధీ హ‌త్యానంత‌రం ఆమె స‌మ‌ర్థవంతంగా కాంగ్రెస్ పార్టీని న‌డిపిస్తున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..