Congo Fever: హడలెత్తిస్తున్న కాంగో ఫీవర్.. 19 మంది మృతి.. దీని లక్షణాలు ఏంటంటే..

|

May 31, 2022 | 11:00 AM

Congo Fever: ఇప్పుడిప్పుడే కరోనా చెర నుంచి బయటపడుతున్న ఇరాక్‌ను ఇప్పుడు మరో ప్రాణాంతక వైరస్‌ వణికిస్తోంది. రక్తం పీల్చే పేలు ద్వారా వ్యాపించే కాంగో హెమోరేజిక్‌ ఫీవర్‌..

Congo Fever: హడలెత్తిస్తున్న కాంగో ఫీవర్.. 19 మంది మృతి.. దీని లక్షణాలు ఏంటంటే..
Congo Fever
Follow us on

Congo Fever: ఇప్పుడిప్పుడే కరోనా చెర నుంచి బయటపడుతున్న ఇరాక్‌ను ఇప్పుడు మరో ప్రాణాంతక వైరస్‌ వణికిస్తోంది. రక్తం పీల్చే పేలు ద్వారా వ్యాపించే కాంగో హెమోరేజిక్‌ ఫీవర్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే 19 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ వ్యాధి ఎలా సోకుతుంది..
కాంగో హెమోరేజిక్‌ ఫీవర్‌ పేలు ద్వారా పశువులు, మేకలు, గొర్రెలకు సోకుతుంది. దీనిని టిక్‌బైట్‌ వైరస్‌ అని కూడా పిలుస్తారు. జంతువుల స్రావాల ద్వారా మనుషులకు వ్యాపిస్తుందని వైద్య పరిశోధకులు తెలిపారు. వైరస్‌ సోకిన వారి రక్తం, మలం, చెమట ద్వారా ఇతర వ్యక్తులకు వ్యాపిస్తుంది.

వ్యాధి లక్షణాలేంటి..
కాంగో హెమోరేజిక్‌ కారణంగా తలనొప్పి, వాంతులు, విరేచనాలు, జ్వరంతో పాటు శ్వాస అడకపోవడం, తీవ్ర రక్తస్రావం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి అథికమైతే చివరకి ప్రాణాలు కూడా పోతాయని చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఇరాక్‌లో 19 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వైరస్‌సోకి ప్రతి ఐదుగురిలో ఇద్దరు మరణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

తొలిసారి ఎక్కడ గుర్తించారంటే..
ఇరాక్‌లో 1979లో తొలిసారి కాంగో హెమోరేజిక్‌ ఫీవర్‌ కేసులు వెలుగు చూశాయి. తాజాగా మరోసారి ఈ వైరస్‌ విజృభించడంతో ఇరాక్‌ ఆరోగ్య శాఖ అలర్టయింది. కబేళాల్లో పని చేసే వారితో పాటు పశు వైద్య సిబ్బంది కూడా టిక్‌బైట్‌ బారిన పడుతున్నారని అధికారులు తెలిపారు. వైరస్‌ను ఎదుర్కోవడంలో భాగంగా హెల్త్‌ వర్కర్లు పీపీఈ కిట్లు ధరించి పశువుల మీద క్రిమిసంహార మందులకు పిచికారి చేస్తున్నారు. జులై మాసంలో ఇరాక్‌లో పండుగలు ఉన్నాయి.. ఈ సమయంలో కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.